మనందరికీ ఆశ్చర్యం గా లేదు 60వేలమంది ఒక రాజు కొడుకులు అంటే! కౌరవులు 100 మంది అంటేనే అమ్మ బాబోయ్ అంటున్నాం.కానీసగరుడు అనే చక్రవర్తి కి 60వేలమంది కొడుకులు.ఇక్ష్వాకు వంశపు రాజు కిసుమతి అనే భార్యవల్ల60వేలమంది కొడుకులు పుట్టారు.వీరుమహా గర్వపోతులు అహంకారులు.కేశిని అనే భార్యకి ఒక్కడే కొడుకు.సగర చక్రవర్తి అశ్వమేథ యాగం చేస్తాడు.ఇంద్రుడు యాగం అశ్విని దొంగిలించి పాతాళ లోకంలో కపిలముని ఆశ్రమంలో కట్టేస్తాడు. గుర్రాన్ని వెతకటానికి 60వేలమంది బైలుదేరి అంతా వెతికి భూమి ని తవ్వి పాతాళ లోకంలో కపిలముని ఆశ్రమంలో గుర్రాన్ని చూస్తారు.అహంకారంతో ఋషిని దొంగ అని నానామాటలు అని ఆయనపై దాడిచేస్తారు.అంతే తన తపోశక్తితో వారి దుడుకుతనం గ్రహించి ఆయన కళ్ళుతెరవగానే వారు అంతా భస్మం ఐపోతారు. మహాత్ములను వారి వేషభాషలు చూసి ఎకసక్కెంగా మాట్లాడటం హేళన చేయటం నేరం.కపిలగీత ప్రసిద్ధి.
ఇక మనం నేర్చుకోవలసింది ఏంటంటే మనమే గొప్ప అని విర్రవీగితే మనకే చేటు.వినయవిధేయతలతో మెలగాలి.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి