అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961
 చేసేదేమి లేక దక్షిణ భారత శాసన సంపుటి 10 పేజీ 269 లో ఉన్న ఈ శాసన పాఠాన్ని పరిశీలిస్తే ఆ శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని గజా సాహిన్యిం గారు కురిందాల పింగళి స్థలాలను పాలిస్తుండగా క్రీస్తు శకం 1311 లో గుండయ్య సాహిని మారయ సాహిని గార్లను పుణ్యంగా  (బహుశా స్థానిక దేవాలయానికి)  రేగడు భూమిని దానం చేసిన వివరాలు ఉన్నాయి కాకతీయ గజ సాహినిలు  ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నట్లు గణపతి దేవుడు, రుద్రమదేవి ప్రతాపరుద్రుల  దుర్గి ఒప్పిచర్ల శాసనాల వల్ల ఈ ప్రాంతం గజ సాహినిల పుట్టిల్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ ఊర్లో ఏమైనా చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని విచారిస్తే అక్కడ నచ్చిన పిల్లలు కంపల్లో ఆంజనేయులు విగ్రహం చిన్న గుడిలో వీరుని  విగ్రహం దుర్గమ్మ విగ్రహాలు ఉన్నాయని వాళ్లే ముళ్ళు గుచ్చుకుంటున్నారు లెక్కచేయకుండా రెండు పర్లాంగుల దూరంలో రాతిగుట్టలో ఇరుక్కుపోయిన నిలువెత్తు ఆంజనేయుని విగ్రహం దగ్గరకు తీసుకొచ్చారు. ప్రతిమా లక్షణం  శైలిని బట్టి విజయనగర కాలానికి (క్రీస్తు శకం 16వ శతాబ్ది) చెందింది అని తెలుస్తోంది విగ్రహం చుట్టూ నాగజెముడు సర్కారు కంప అల్లుకొని ఉంది బతిమలాడితే పిల్లలు తెచ్చారు కంపల్ తొలగించి అపురూప ఆంజనేయస్వామి విగ్రహాన్ని ముళ్ళ కంప చరల నుంచి విముక్తి కలిగించినందుకు ఆనందమేసింది రెడ్డి గారికి పెద్దవాళ్లకంటే అమాయకులైన మీరే మేలని పిల్లల్ని భుజం తట్టి మళ్ళీ రోడ్డు మీదకు వచ్చి దుర్గి చేరుకున్నారు. జగన్నాథం గారి పంచన మంచం పైకి కొంచెం సేపు నడుము వాచి ఆయన చేసి పెట్టిన ఔషధపరిత ఆకుకూరల ఉప్మా తిని సువాసనలు వెదజల్లు తున్న వేడివేడి కషాయం తాగి సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమైనాడు రెడ్డి గారు.
ఒకప్పుడు సమతా మమతలు పల్లవించిన పల్లవులను మనకందించిన పౌరుషానికి పురుడు పోసిన అనుకూల నాగరికతను నిప్పుకున్న పల్నాడు  చారిత్రక  ఆనవాళ్లు నిలువెత్తు నిర్లక్ష్యానికి గురవడం రెడ్డి గారిని  ఇప్పటికీ బాధిస్తూనే ఉంది ఎప్పుడో ఎవరో ఒకరి వీటిని ఉద్ధరిస్తారన్న ఊపిరి ఆశ వారిని ఊరడించడానికి ప్రయత్నిస్తుంది.  ఈ ప్రయత్నంలో  నాకు వారి వ్యక్తిత్వం స్పష్టంగా తెలుస్తోంది  వారికి సహకరించిన లేదా సాయం చేసిన  వ్యక్తులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా  చిన్న లైనా పెద్దలైనా  పెద్దలైతే భుజం తట్టి కృతజ్ఞతలు చెప్పి  చిన్నవారైతే  బుజ్జగిస్తూ ఈ వయసు నుంచి ఇతరులకు సహకరించడం సాయం చేయడం నేర్చుకోండి అని  సలహాలను ఇస్తూ  వారికి కూడా  కృతజ్ఞతలు చెప్పడం వారి సంస్కారం  అనిపిస్తోంది నాకు.



కామెంట్‌లు