గొప్ప గుణం ;- సంగేపు కీర్తన - 8వ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్- మెదక్ జిల్లా-9550809625

    అనగనగా ఔరంగాబాద్ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దశరదయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణ్ నలుపు రంగులో ఉంటాడు. రామ్ తెలుపు రంగులో ఉంటాడు. గ్రామంలోని ప్రజలు అందరూ లక్ష్మణ్ నలుపుగా ఉండడం చూసి హేళన చేసేవారు. అలాగే లక్ష్మణ్ కు దూరంగా ఉండసాగారు.
               తనకు గ్రామస్తులు, దోస్తులు అందరూ దూరంగా ఉంటున్నారని లక్ష్మణ్ తన తల్లికి చెపుతాడు. నేను చేసిన తప్పేంటి అమ్మ అని లక్ష్మణ్ ఏడుస్తాడు. అప్పుడే వచ్చిన రామ్ తమ్ముని ఓదారుస్తాడు. ఇద్దరూ పెరిగి పెద్దగైనారు. ఇద్దరు పట్నంలో చదువుకో సాగారు.
      ఒకరోజు గ్రామ సర్పంచ్ కోటయ్య అడవిలో వెళుతుంటే దుండగులు అడ్డుపడి కోటయ్య పై దాడి చేస్తారు. కోటయ్య కు బాగా గాయాలయితాయి. రక్తం బాగా కారిపోతుంది. కోటయ్యను పట్నంలోని ఆసుపత్రిలో చేర్పిస్తారు. కోటయ్యకు గాయం బాగా అవడంతో రక్తం లేకపోవడంతో అర్జెంటుగా కోటయ్యకు రక్తం అవసరమైతే లక్ష్మణ్ బ్లడ్ గ్రూప్ మాత్రమే సరిపోతుంది. అప్పుడు లక్ష్మణ్ మాత్రమే కోటయ్యకు రక్తం ఇవ్వగలుగుతాడు. కోటయ్య తాను లక్ష్మణ్ నుంచి తీసుకున్న రక్తం మూలంగా ఆరోగ్యంగా అవుతాడు. లక్ష్మణ్ శరీరం నలుపైన తనలో ఉన్నటువంటి రక్తం నన్ను రక్షించిందని, మనిషికి రంగు కాదు గుణం ముఖ్యమని గ్రామస్తులకు కోటయ్య తెలుపుతాడు. ఒకసారి సెలవులలో ఊరికి వచ్చిన రామ్, లక్ష్మణులను గ్రామస్తులు ఆప్యాయంగా పలకరించసాగారు. అప్పుడు లక్ష్మణ్ చాలా సంతోషిస్తాడు. అప్పటినుండి గ్రామంలో నలుపు, తెలుపు అన్న భేదం లేకుండా అందర్నీ ఒకేలా చూడసాగారు.
నీతి: ప్రతి మనిషిలో చూసే రంగు కాదు గుణం ముఖ్యమని తెలుసుకోవాలి

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం