ఎక్కువ-తక్కువ- రావిపల్లి వాసుదేవరావు- విజయనగరం-9441713136
రూపంలో స్వల్పమనీ!
చిన్నగా నను చూడకుమీ!
కొండంత చీకటి తరిమే
వెలుగుల దివ్వెనే నేను!!

చూపుకు చిరుగింజననీ!
అల్పంగానూ చూడకుమీ!
వృక్షంనై ఆయువునిచ్చే
వరముల విత్తునే నేను!!

సుతిమెత్తగా ఉన్నానని
తేలికగాను చూడకుమీ!
పరిమళాలు వెదజల్లేటి
తరువుల విరినే నేను!!

చేతిన చిరు పుస్తకమనీ
తక్కువగా చూడకుమీ!
జీవితసత్యాలు తెలిపే
గొప్ప గ్రంథాన్ని నేను !!

కర్రచెక్కనూ నేననీ
బయటకు నన్ను విసిరేయకు!
ఆపదలో ఒడ్డుకు చేర్చే
చిన్న తెప్పనూ నేను !!




కామెంట్‌లు