ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కొడాలి గోపాల రావు గారు చైర్మన్ నాటకం రాసి  డాక్టర్ రాజారావు గారికి ఇస్తే  దానిలో కృష్ణను  సినీ నటుడు  అప్పటికి రంగ ప్రవేశం చేయలేదు  అతను నచ్చక  దానికి వారు దర్శకత్వ బాధ్యత తీసుకోలేదు  ఆ తర్వాత ఆయన శిష్యుడు కర్నాటి ఆ నాటకాన్ని తీసుకువచ్చి విజయవాడలో  నాతో పాటు  పనిచేసిన అనుభవంతో నన్ను  కథానాయకున్ని పాత్ర వేయమన్నారు  దానిలో చైర్మన్ పాత్ర ఎవరికి అని అనుకుంటున్నప్పుడు  నాన్న గారి పేరు రావడం  వారిని ఒప్పించి దానిలో నాకు తండ్రి పాత్రగా  వేయడం  అప్పట్నుంచి నేను నిజ జీవితంలో కూడా వారిని నాన్నగారని పిలుస్తున్నాను  వారు కూడా నన్ను వారి మిత్రులకు కానీ స్నేహితులకు కానీ పరిచయం చేసినప్పుడు మా పెద్దబ్బాయి అని పరిచయం చేస్తారు. నాన్నగారితో సాధన చేయడం  ఒక గొప్ప అనుభూతి  ఎదుటి పాత్రధారుల పద్ధతిని అనుసరించి  వారికన్నా కొంచెం పై స్థాయిలో చేయడం  వారి అలవాటు  ప్రక్క వారు ఎంత పెరిగితే వారు అంత పెరగగలరు  దాంట్లో హాస్యగాళ్ళు చదలవాడ కుటుంబ రావు నల్ల రామ్మూర్తి  నండూరి సుబ్బారావు గారు  మొదటి ప్రదర్శన 1963 మే 19వ తేదీన హనుమంతరాయ గ్రంథాలయంలో  నా వివాహం రోజున ప్రదర్శన  ఏర్పాటు చేశారు  నాటకం చివరిలో మమ్మల్ని సన్మానించడం  బందా కనకలింగేశ్వర రావు గారు వచ్చి భుజం తట్టి హీ ఈస్ మై హీరో అని ప్రశంసించి  శ్రీమతి అరుణను ఆశీర్వదించి వెళ్లారు  అలా మొత్తం 100 ప్రదర్శనలు  నేను చైర్మన్ నాటకంలో  కథానాయకుడు  గా వేశాను. నాన్నగారికి గొల్లపూడి ప్రెసిడెంట్ గారు చాలా దగ్గర స్నేహితుడు  నాన్నగారికి బాగా దగ్గర వారిని  సన్మానం చేద్దాం నాకు మా ఊరిలో మంచి పేరు వస్తుంది అని అడిగాడు హరనాధ్ తో పాటు రాజనాల కాంతారావు పిఠాపురం నాగేశ్వరావు మదర్ తెరిసాములతో పాటు  మాచినేని వీరయ్య కొడాలి గోపాలరావు నేను  నాన్నగారు ఉన్నాం  అందర్నీ గొల్లపూడి తీసుకువెళ్లి సన్మానం ఏర్పాటు చేశాడు గ్రామం మొత్తం అంతా వచ్చింది  కార్యక్రమం అయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నేను రాజనాల నాన్నగారు వస్తున్నాము దోవలో చిరిగిన మాచిన బట్టలతో ఉన్న స్త్రీని చూసి  గేదలు మేపుతున్న ఆవిడ దగ్గరికి వెళ్లి తన జేబులో నుంచి పరుసు తీసి డబ్బు ఆమె చేతికిచ్చి వచ్చారు  అంత దయార్ద్ర  హృదయుడు  రాజనాల.


కామెంట్‌లు