ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 స్క్రీన్ ప్లే పూర్తి అయిన తర్వాత విజయవాడ వచ్చి మాకు వినిపించితే  నాన్నగారికి అసలు నచ్చలేదు  సినిమాలో వాడే భాషా   ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో ఉండాలి  వారి నాడి తెలిసి  నాటకీయతను  మేళవించి రాస్తే తప్ప  అది విజయవంతం కాదు అన్నది వారి అభిప్రాయం. రాయడంలో మా ఆస్థాన రచయిత కొడాలి గోపాల రావు ని పిలిపించి నాన్నగారింట్లోనే  ఉంచి వ్రాయించడం మొదలుపెడితే  నేను చెప్తాను ఆనంద్ రాస్తాడు  అని మెలిక పెట్టి నాతో రాయించారు  గోపాల్ రావుకు చుట్టా, టీ లేకపోతే పని జరగదు  దానికోసం ప్రత్యేకంగా మా  ఆత్మీయ మిత్రుడు నాన్నగారికి మేనల్లుడు రామచంద్ర రాజు ను పిలిపించి అన్నీ ఏర్పాట్లు చేశారు  రచన పూర్తి అయిన తర్వాత  ఏ పాత్రలు ఎవరు చేస్తే బాగుంటుందని  ఆలోచించి పాత సినిమాలో డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు  చేసిన వేషానికి ఎన్టీ రామారావు గారు  సరిపోతారని  వెళ్లి  వారితో మాట్లాడి వారి అంగీకారాన్ని తీసుకొని  పాత సినిమాలో కన్నాంబ ధరించిన పాత్ర భానుమతి గారు చక్కగా సరిపోతారు అని ఆలోచించి తిన్నగా వారి దగ్గరకు వెళితే  ఈ పాత్ర వేస్తే నాకు ఉన్న పేరు కూడా పోతుంది  మహానటి కన్నాంబ గారు  వేసిన వేషం నేను వేసి మెప్పించడం అనేది ఈ జన్మలో జరగని పని  అలా అరవడం నాకు చేతకాదు  అనే నిరాకరిస్తే  ఎంతో నిరుత్సాహంతో వీరయ్య గారు  తిరిగి విజయవాడ వచ్చి నన్ను నాన్నగారిని తీసుకుని మద్రాస్ వెళ్లారు  నేను నాన్నగారు  భానుమతి గారి ఇంటికి  వెళ్ళగానే రండీ ఆనంద గారు చాలా కాలం అయింది మీరు వచ్చి  అని ఎంతో  ఆప్యాయంగా ఆహ్వానించారు.మర్యాదలన్నీ పూర్తయిన తర్వాత  చెప్పండి ఆనంద గారు పని మీద వచ్చారా ఊరికే వచ్చారా అని అడిగారు భానుమతి గారు  మీకు  పల్నాటి యుద్ధం కథ నచ్చినట్టుగా లేదు  అది  గుర్తు చేయడానికి వచ్చాం అనగానే  నాన్నగారు అందుకొని కన్నాంబ అమ్మగారు చాలా గొప్ప నటి ఆవిడని గురించి  దురభిప్రాయం ఎవరికి ఉండదు  కానీ అసలు  నాగమ్మ పాత్ర అది కాదు  జిత్తుల మారిది  తనపై వచ్చిన అభాండాలను తొలగించుకోవడం కోసం  ఆమె మంత్రిగా వచ్చారు  శ్రీకృష్ణ పరమాత్మను దేశాన్ని స్త్రీ పాత్ర చేస్తే  అది నాగమ్మ  ఆ పాత్రకు మీరు తప్ప మరొకరు  సరిపోదు  అని చెప్పిన తర్వాత  నా వేషం పూర్తి అయ్యేంతవరకు మీరు దగ్గరే ఉండాలి  నేను ఏ ప్రక్కకు వెళ్లినా తిరిగి సరైన మార్గంలో పెట్టే పూచి మీది అని వేషం వేయడానికి అంగీకరించారు.



కామెంట్‌లు