శ్రీ శివాభ్యాం నమః!- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098

 🔱సోమ కళాధర! శివా!
  భవానీ శంకర! భవా!
      మహా లింగోద్భవ! శివా!
     శివా నమో! నమః శివా!
     [ అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ., ]
   
🔱"శ్రీ శివాభ్యాం నమః!" అని, శ్రీ ఉమా మహేశ్వరు లను.. అనుదినము భక్తి ప్రపత్తులతో స్మరించ వలెను! సర్వ మానవ వాళికి.. సమస్త శుభములు, కళ్యాణములు, మంగళములు... అనుగ్రహించు; శ్రీ శివ పార్వతులకు చేతులను జోడించి నమస్కరించ వలెను!
🔱శ్రీభవానీ శంకరులు... శ్రుతిప్రసిద్ధ సకలవిద్యా స్వరూపులు (సాదాఖ్య చంద్రకళా స్వరూపులు)! శిఖలచే అలంకరింపబడిన చంద్రకళలు కలవారు! తమతమ తపస్సులకు ఫలితముగా దాంపత్యమును పొందిన వారు! భక్తులకోరికలు నెరవేర్చువారు! ముల్లోకములకు అధికమయిన మంగళములు నొసంగు వారు! ధ్యానము చేయువారి హృదయమున మరల మరల సాక్షాత్కరించువారు! నిత్యానందమును అనుభవించువారు అగు, శ్రీశివాశివులకు ...ఇదియే నా నమస్కారమగు గాక! అనగా, పార్వతీ పరమేశ్వరులకు రెండుచేతులను జోడించి నమస్కరించు చున్నాను
🚩జగద్గురు ఆది శంకరాచార్యులు వారు" శ్రీశివానంద లహరి" స్తోత్ర రత్నము, మంగళాచరణ శ్లోకము నందు "శ్రీశివ పార్వతులు" ఇరువురిని ఈ విధంగా ప్రార్ధన కావించారు!
🔱 కలాభ్యాం, చూడాలంకృత శశికలాభ్యాం, నిజతపః 
      ఫలాభ్యాం, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, భవతు మే!
      శివాభ్యాo, అస్తోక త్రిభువన శివాభ్యాం, హృది పున 
       ర్భవాభ్యాo, ఆనందస్ఫుర దనుభవాభ్యాం నతిరియమ్ !!
           🔆🪷🔆
       🚩సీస పద్యము
     సకల కళాఢ్యులై చంద్రకళను శిరోz లంకారముగ దాల్చి యలరువారు
    ఒకరి తపoబున కొకరు ఫలంబయి
అన్యోన్యముగ లభ్యమైనవారు
     భక్తజనుల వారివారి భక్తికి దగు ఫలముల నిచ్చి కాపాడువారు
     ముల్లోకములను సముల్లసితంబుగా మంగళంబులఁ గూర్చి నెగడువారు
               (🚩తేట గీతి పద్యం)
     హృదయమున మాటి కావిర్భవించు వారు 
మోక్షకాముల కానందమును ఘటింప
     స్వీయరూపము సాక్షాత్కరించు వారు 
నగు, శివాశివులకు మదీయాంజలి యిది!!
         ( ఆంధ్రీకరణ:- కార్యంపూడి రాజ మన్నారు.,)
ఓం నమఃశివాయై నమఃశివాయ!
కామెంట్‌లు