"వచసా చరితం వదామి శంభో!"- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల-సంచార వాణి:- 99127 67098
 🙏భక్తి ప్రపత్తుల తోను
     త్రికరణ శుద్ధి గాను
     సేవింతుము శంభోశివా!
     శివా నమో! నమః శివా!
         ( అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)
👌సాంబ సదాశివుని.. మనోవాక్కాయము లనెడు, త్రికరణముల శుద్ధిగా;  శక్తివంచన లేకుండా సేవించాలి, మనమంతా!
🔱శంభోశివా! మీయొక్క అర్చనాది విధులయందు సమర్థుడను కాను!ఉత్తమములైన శివయోగముల యందు పరిచయము లేదు. చంచలమైన మనస్సు, స్థిరముగా నిలువదు! కావున, వాక్కుతో ..మీ చరితమును పలుకు చున్నాను! మనస్సు నందు.. మీ స్వరూపమును థ్యానించు చున్నాను! శిరస్సుతో.. మీపాద పద్మములను నమస్కరించు చున్నాను!.. ఈ విధంగా భక్తి ప్రపత్తులతో మిమ్ము సేవించెదను! నన్ను అనుగ్రహింపుము స్వామీ! అని, జగద్గురు ఆదిశంకరులు ప్రార్థించారు!
🔱వచసా చరితం వదామి శంభో!
     అహముద్యోగ విధాసు తేzప్రసక్తః!
     మనసాzకృతి మీశ్వరస్య సేవే
     శిరసాచైవ సదాశివం నమామి!!
             (శ్రీశివానంద లహరి.. 90.వ శ్లోకము)
           🚩కంద పద్యము 
    తలపున నిను కొలుచుటయున్ 
    తలచే మ్రొక్కుటయు, వాక్కునను నీ చరితం 
    బులు కీర్తించుట గా కే 
    కలుములు వలదయ్య! నాకు గౌరీరమణా !
        ( రచన:- శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి.,)
               🌷🪷🌷
         🚩తేట గీతి పద్యం 
    నీదు పరిచర్య తెలియదు, నిక్కమిదియ 
   గాన, చరితము కీర్తింతు, గళము నెత్తి
  నీదు మూర్తిని సేవింతు, నెమ్మనమున 
   శిరము వంచియు నతిజేతు, శివ! మహేశ!
        (రచన:-  డాక్టర్ "శ్రీపాదుక")
🕉️ నమఃశివాయై నమఃశివాయ!

కామెంట్‌లు