పుస్తక నేస్తాలు'- -గద్వాల సోమన్న,9966414580
పుస్తకాలు చదివితే
మస్తకాలు వెలుగుతాయి
ప్రేమతో దరి చేరితే
శాంతితో నింపుతాయి

విజ్ఞాన కాగడాలు
విలువైన పుస్తకాలు
లోటుపాట్లు సరిచేసి
బాగు చేయు జీవితాలు

అద్దమే పుస్తకాలు
దిద్దుతాయి లోపాలు
గుబాళించు కుసుమాలు
ఎదుగుటకు సోపానాలు

వెల్లడించు వాస్తవాలు
తెలియజేయు విషయాలు
పుస్తకాలు నేస్తాలు
అందించు స్నేహ హస్తాలు

పుస్తకాల ప్రేమికులు
విజ్ఞాన సంపన్నులు
సరస్వతీ వారసులు
బలీయమైన సైనికులు


కామెంట్‌లు