పెద్దల మాటలు;- -గద్వాల సోమన్న,9966414580
అనుభవజ్ఞులు పెద్దలు
అమూల్యమే మాటలు
ఆసక్తిగా వింటే
కోకొల్లలు దీవెనలు

దిద్దుతాయి బ్రతుకులు
సరిచేయును నడతలు
ఉజ్వల భవితకవి
వేయు పసిడి బాటలు

జీవితాన శుభములు
తరగని సిరి సంపదలు
శ్రద్ధగా గైకొనిన
అవే పూల పాన్పులు

వయసులోన పెద్దలు
వెలుగులీను ప్రమిదలు
గౌరవిస్తే వారిని
వర్ధిల్లు కుటుంబాలు


కామెంట్‌లు