.. గ్రంధాలయం... !; - . కోరాడ నరసింహా రావు.
 అక్షర నిక్షిప్త గ్రంధాలయం 
 జ్ఞాన, విజ్ఞాన ప్రదాయికం 
  సన్మాన, సత్కార ప్రసాదితం 
    నమోస్తుతే !పుస్తకాలయం!!
 🙏🌷🙏💐🙏🌷🙏💐
        *******
భక్తి, శ్రద్ధలను గఱపే...
 దేవాలయాలు ... !
 చదువు, సంస్కారాలను 
   నేర్పే... విద్యాలయాలు .. !
 ఆప్యాయతానురాగాలను... 
   అలవరచే ... గృహాలయాలు .. !
అనారోగ్యాన్ని  బాపి... 
 ఆరోగ్యాన్ని ప్రసాదించే వైద్యాలయాలు !
  ప్రజా ప్రయోజనాలు నెరవేర్చే 
  ప్రభుత్వకార్యాలయాలు !
జన హితమును గూర్చే...
ఇవన్నీ పవిత్ర  ఆలయాలే !!
అన్ని ఆలయాల లోకీ... 
  ప్రాశస్త్య మైనవి, మన గ్రంధాలయాలే  ... !!
 .. స్కూళ్లన్నీ... ప్రాధమిక విద్యను బోధిస్తే..., 
  ఒక్కో కాలేజీ... ఒకో డాక్టర్ నో 
  ఇంజనీర్నో... లాయరునో... Ias.... Ips. లనో తయారుచేస్తే 
  కేవలం ఒక గ్రంధాలయం... 
  విజ్ఞాన సర్వస్వాన్నీ అందిస్తూ 
... వివేకవంతుల గావిస్తూ...  
  వ్యక్తిత్వ వికాసాన్ని గరపుతూ 
  ఎవరి అభిరుచికి తగిన జ్ఞాన విందును వారికి  అందించి... 
ఆనంద పరుస్తోంది !
   
మామూలుమనిషిని... 
  సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్ది...  
 సమాజానికందిస్తోంది !
ఈ గ్రంధాలయ పవిత్ర జ్ఞాన జీవనది.... 
   కావలసిన వారికి, కావలసినది... కావలసినంత 
 అందిస్తూనే ఉంది !!
 అనంత జ్ఞానమయం... 
   గ్రంధాలయం !
 నిరంతర సరస్వతీ నిలయం 
   గ్రంధాలయం !
అజ్ఞానాంధకార 
  సంహారిణి గ్రంధాలయం !
విజ్ఞానతేజ  ప్ర్రభా భాసిని  ... 
    గ్రంధాలయం... !
గ్రంథాలయాలను ఆశ్రయిoచిన వారు... అజ్ఞానమును తొలగించుకుని, మిడి - మిడి జ్ఞానమున బడక... విజ్ఞాన వంతులై ప్రజ్ఞానమును ప్రదర్శించి, సుజ్ఞానముతో ముక్తులై, మోక్షమును బడయు చున్నారు... !....
మనమూ ఈ గ్రంధాలయముల నాశ్రయించి... 
 తేజోమూర్తులమై ప్రకాశిద్దాము  !!
..      ******

కామెంట్‌లు