* నిద్దరోయింది పాప ! *
******
హాయి - హాయి గా... లాలపోసి
ఒంటినిండా... పౌడరు పూసి
పిలక జెడ లేసి పువ్వులు పెట్టి
కళ్ళకు సన్నగ కాటుక దిద్ది
నుదుటన పెద్ద బొట్టును ....
బుగ్గన దిష్టి చుక్కను పెట్టి .....
బొమ్మల గౌను పాపకు తొడిగి
మారాము చేసే గారాల బిడ్డకు
అదిగో పిల్లి - ఇదిగో కుక్కని...
నువ్వుతినకున్నఅవితినిపోవని
బొజ్జనిండా బువ్వ పెట్టి.....
ఊయలలో వేసి జోలాలి..
జోలాలి... జోలాలి యనుచు
పాటనే పాడింది అమ్మ... !
హాయిగా బజ్జుoది...పాప !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి