తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం |
దదర్శ సీతాం ధ్యాయంతీం అశోక వనికాం గతాం |
నివేదయిత్వా అభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ |
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం
అంతట ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవికొఱకు వెదకుచు అతడు అశోక వనమున అడుగిడి, అచట రామధ్యానమున నిమగ్నయైయున్న జానకిని కనుగొనెను.
పిదప ఆంజనేయుడు సీతాదేవికి "రామసుగ్రీవుల మైత్రిని దెలిపి, రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్నతీరును వివరించి, ఆమెను ఓదార్చెను, పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను.
ఓం శ్రీ రామం
****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి