శాంతి పరిరక్షణ కోసం కవులు, రచయితలు కృషి చేయాల్సిన అవసరముందని ప్రముఖ కవి, రచయిత, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల అధ్యక్షుడు డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ వందే విశ్వ మాతరం పేరుతో వంద దేశాల్లో నిర్వహించనున్న శాంతి సద్భావనా యాత్ర బ్యానర్ ను, కరపత్రాన్ని మేడ్చల్ లో ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమన్వయకర్త చొప్పదండి రాధ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ శాంతి సద్భావనా యాత్ర నిర్వహించడం సందర్భోచితమని డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు అభిప్రాయపడ్డారు. ఈనెల తొమ్మిదో తేదీన ఆఫ్రికా ఖండంలోని బోట్స్ వానాలో ఈ యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్ర నిర్వాహకులను, ఉత్తర అమెరికా తెలుగు సంఘం కార్యవర్గాన్ని ఆయన అభినందించారు.
వంద తెలుగు సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నట్టు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవయిత్రి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమన్వయకర్త చొప్పదండి రాధ చెప్పారు. బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షుడు తోటకూర వెంకటేశ్వర రావు ఆద్వర్యం లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక సభ్యులు, కవులు నర్సింగం, గాయత్రి, మహేశ్వరి, గిరిధర్, బాలరాజు తదితరులు ప్రసంగించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక సభ్యులు, రచయితలు, కవులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి