భీష్మ పితామహుడు అష్టవసువుల్లో ఒకడు.వసువులు దేవగణంకి చెందినవారు.వారు వశిష్ఠుని ఆవు నందినిని దొంగిలించారు.దాన్ని తీసుకుని వెళ్లి పెద్ద నేరం చేసినవాడు 8వవసువు.అసలు ఎందుకు గోవుని లాక్కెళ్లారు?నందిని తల్లి సురభిగోవు.పాలతోపాటు హోమం కి కావలసిన పదార్ధాలు పొదుగు నుండి కురిపిస్తుంది.అందుకే ఆశక్తులున్న నందినిని కాజేయాలనుకున్నారు.దానికోకారణం ఉంది.ఒక వసువు ప్రభాసుడు భార్య అడిగింది " నాధా! నాస్నేహితురాలు జితవతి వృద్ధాప్యం రోగాలు అంటే భయపడుతోంది.ఈనందిని ఆవుని ఆమె కి బహుమతి గా ఇస్తాను.దాన్ని తీసుకుని రా!" అంతే అతను ఆగోవుని లాక్కుని వెళ్లి వసిష్ఠుని శాపంపొంది గాంగేయుడిగా తల్లి గంగదగ్గర పెరిగాడు.పైగా విశేషం ఏమంటే ఆవశిష్ఠుని దగ్గరే సకలశాస్త్రాల్లో పారంగతుడైనాడు.తను శపించిన వాడికే విద్యనేర్పిన ఉత్తమ గురువు వశిష్ఠ మహర్షి.కేవలం దాశరథి రాముని కి భీష్ముడికి మాత్రమే చదువు చెప్పిన మహాత్ముడు🌷
భీష్ముని పూర్వజన్మ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి