రాధా హృదయం - కొప్పరపు తాయారు

 రాధనురా కృష్ణ మధురమైన బాధను రా
మరపురాని మరువలేని గాధనురా
అల్లన పిల్లనగ్రోవి లో మధురస్వర
రూపాన్ని నీ మది నారాదించే
అమృత ధారనీ నీరాధను కృష్ణా!!! 
మనసు నిండా మమత నింపి
మధుర భావన లతో నీకై ఎదురుచూచు నీ తీపి బాధని
మురళీధర మౌనమేలరా !!!
మృదు మధుర మురళీ గానామృతము
గ్రోల మది తహతహ లాడెరా
ఓ మాధవా, దయలేదా? కరుణ లేదా ?
వెన్నెల సొభగులు వెతలాయె
కన్నుల సొగసులు కలవరమాయే 
మిన్నుల వెన్నెల వెలవెలబోయే
కమనీయమైన తలపులు కలతలాయె
రాధే బాధై కరిగిపోవ రా రాదా
నీ మది కరుగదా వెన్న దొంగవి కదా
వినిపించ లేదా ఈ రాధ బాధ
ఎదురుచూచి ఎదురు చూచి
ఒక తీపి బాధగా మిగిలేనా
లేక మధుర గాధగా మిగిలేనాకృష్ణా
కామెంట్‌లు