మహిళ- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 లేడీసేంది? మొగీసేంది?
అంతా సమానమంటున్రు
తరతరాల వంచనను ప్రశ్నలతో చింపేశిన్రు
బస్సుల్ల,రైల్లుల్ల మాసీట్లు మాకే అంటున్రు
అసెంబిలీల్ల సీట్లను, పార్లమెంటు గద్దెల్ని ఎక్కి
ఆడోల్ల కష్టాలబతుకుల్ని ఆరబోశిన్రు
యిడాకుల సట్టం దెచ్చిన్రు
టీశర్లు,దాకుదార్లు,డైవర్లు,గుమాస్తాలు,
ఇంజనియర్లు,ఆపీసర్లు అంతెందుకు
జవాన్లుకూడా ఆడోల్లయితున్రు
అంతేగాదు, రాకిట్లల్ల వోయి 
ఆకాశంల షికార్లు కొడుతున్రు
అందుకే కాయకష్టం జేసేతందుకు
మీకు మాకు ఫరకేందని మొగోల్లను దెప్పుతున్రు
మీకంటే మేం దేన్ల తక్వనో శెప్పుమని అడుగుతున్రు
యీలైతే మాలెక్క పిల్లల్ని గనున్రి అని సవాల్ జేస్తున్రు
ఇప్పుడు ఆడిది 
కుక్కిన పేను గాదు కాలికింది శెప్పుగాదు 
ఒంటరిపోరులో ఏడపాయల దుర్గమ్మ!
లష్కర్ మాంకాలమ్మ!!
*********************************

కామెంట్‌లు