బిల్వపత్రములు, తెల్ల జిల్లేళ్ళ తోనే... తృప్తి చెందుతాడు !
భక్తితొ నమస్కరించిన, వశమౌ భోళా శంకరుడు !
త్రికూటమ్మున అగ్ని నేత్రము
కంఠమున కాలకూటము... !
శిరమున గంగ తో....
నిత్య వాయుభక్షణ యోగములో ... పృధివీ తత్వపు లింగముగా...
పంచభూతముల ఆకృతి నేనని, చాటి చెప్పె చూడు !
సంగీత, సాహిత్య, నాట్య త్రయముకు జన్మ నిచ్చినాడు!!
భవుండీశివుడు,భక్తవశoకరుడు!
హర హర హర హర మహాదే వ శంభో హర హర శంకరా యనుచు.. కీర్తింతము రండు!
******
లింగమూర్తి ఆ పరమశివు డభి షేక ప్రియుడు !- ...కోరాడ నరసింహా రావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి