కిలకిలమంటూ నవ్వుతూ
కళ కళ లాడుతూ విరిసిన
నవనవలాడే కుసుమాలు
పొంగిపొర్లు సంతోషాలతో
పొలమారేటంతగా
పైడి పొరలు పరచిన పుష్పాలు
ప్రియతమని రాక కై
ప్రీతి నిండిన హృదయంతో
పరిమళాలు వెదజల్లు ప్రసూనాలు
ఆహ్లాదాలు ఆనందాలు పంచుతూ
కేరింతలతో కొమ్మల్లో ఊగుతూ
అనాయాసంగా రాలిపోవు రేకులు
సొమ్మసిల్లని ఆశలతో
సన్నగిల్లని నమ్మకంతో సాగే
స్వార్థమెరుగని జన్మలు
తేటనీటి ఏటి ఒడ్డున
మేట వేసిన సొగసులాగా
ఆటలాడు అరవిందాలు
కదిలివచ్చు కాంతిరథానికి
ఎదురేగి స్వాగతించ
కనువిందుగ విరిసిన విరులకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి