అంతా లెక్క ప్రకారమే జరిగింది
లెక్కలేనంత విశ్వం
అంతా లెక్క ప్రకారమే నిర్మించబడింది.!!
రక్త మాంసాలకు పూర్వము
పంచభూతాలకు పూర్వము
ఆ తర్వాత
అంతా లేక్క ప్రకారమే జరిగింది.!!
ఒక ఇంజనీరు
భవనాన్ని నిర్మించినంత అనుభవంతోనే
విశ్వమంతా ఒక లెక్క ప్రకారమే జరిగింది.!!
రక్త మాంసాలు గాలి పదార్థము ఎనర్జీ ఏదైనా ప్లాను ప్రకారమే ఏర్పడింది.
కానీ
ప్రీప్లానుడుగా జరగలేదు.
యాదృచ్ఛికంగానే జరిగింది.!!!?
అంతా లెక్క ప్రకారమే జరిగింది.
ఆ తర్వాత ప్రశ్న పుట్టింది
ప్రశ్నలకు లెక్కలేనన్ని ప్రశ్నలు పుట్టాయి
ఆ ప్రశ్నలు లేక్క ప్రకారమే పుట్టాయి.!!
శూన్యంలోంచి లెక్కలు పుట్టాయి
శూన్యంలోంచి పదార్థం పుట్టింది
శూన్యంలోంచి గాలి పుట్టింది
శూన్యంలోంచి ఎనర్జీ పుట్టింది
అంతా లెక్క ప్రకారమే జరిగింది.!!!
ప్రశ్న మత్తు వదిలి మేల్కొని
పరిసరాలను పరిశీలించి మళ్లీ
లెక్కలతోనే లెక్క లేనన్నీప్రశ్నలకు
ప్రాణం పోసింది.!!!
అదంతా భూమిపైనే జరిగింది
ప్రశ్నా విశ్వంలో భూమిపైనే పుట్టింది!!.
విశ్వం నమూనాను రూపాన్ని నిర్మాణాన్ని
ప్రశ్న కాపీ కొట్టింది.
ప్రశ్నకు ప్రశ్న పుట్టింది.
అది ప్రశ్నపుట్టుగాను కనిపెట్టింది.!!!
లెక్కలే లేకుంటే
ప్రశ్నకు పుట్టికే లేదు.!!
మనం ఇంకా
సమాధానం కోసం వెతుకుతున్నాం!!?
కానీ
మనం ప్రశ్న కోసం ప్రయత్నిద్దాం!!!
మనం లెక్కల కోసం జీవిద్దాం!!!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి