సుప్రభాత కవిత ;- బృంద
కొండకావల కోటివెలుగులు
కరిగిన కాంచన కాసారంలా...
వెలుగుతున్న హోమగుండంలా

చిమ్మచీకట్లు తొలగించు
దివ్య ప్రభల  వెలుగులు
నవ్య ఉదయపు స్వర్ణ కాంతిలా

ఉద్భవించు ఆదిశక్తి 
కరుణ నిండిన చూపులంత
కమనీయ కటాక్షంలా

జగజ్జనని  కిరీటాన పొదిగిన
మిలమిలా మెరిసే  
కనకపుష్యరాగపు  మెరుపులా

లోకాన్ని కాచి రక్షించు
చెదలు పట్టని రూపుమారని
ధర్మజ్యోతి ధగధగలలా

జగతిలోని జీవులను
సుగతిని నడిపింప  వచ్చే
ప్రగతి రథ  ప్రకాశంలా

ప్రభవించు  ప్రభాకరుని
ప్రభల  ప్రబల  పసిడి కాంతులు
ప్రసరించు ప్రత్యూష వేళకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు