సజ్జనుల సహవాసం మహిమ- సి.హెచ్.ప్రతాప్

 కాలేన ఫలతే తీర్ధం సద్య: సాధు సమాగమ: అన్నది శాస్త్ర వాక్యం. అంటే తీర్ధ క్షేత్ర దర్శనం వలన కలిగే ఫలితం భవిష్యత్తులో అందుతుంది కాని సాధువుల సమాగమనం వలన ప్రాప్తించే ఫలితం దర్శించినంతనే కలుగుతుందని అర్ధం.
త్యజ దుర్జన సంసర్గం అని తరచుగా మన పెద్దవారు అంటుంటారు. అంటే  చెడ్డవారి సాంగత్యం మనకు ఉపయుక్తం కాదు, దానిని తక్షణం త్యజించాలి. ఎందుకంటే ఆ చెడ్డ అంతా మనలో ప్రవేశిస్తుంది. నీకు చేతనైతే చెడ్డవారిని మార్చటానికి ప్రయత్నం చేయి. కనుక 'త్యజ దుర్జన సంసర్గం'. అది చేసినంత మాత్రమున చాలదు. 'భజ సాధు సమాగమం'. మంచివారితో స్నేహము చేయాలి. మంచివారితో స్నేహము చేసినప్పుడే మనము మంచిస్థాయికి పోతుంటాము. మంచివారిలోని సద్గుణాలన్నీ మనలో ప్రవెశించి దుష్ట సంస్కారాలను నాశనం చేస్తుంటాయి. మనల్ని క్రమంగా ఆధ్యాత్మిక పధంలోకి నడిపిస్తుంటాయి.
ప్రతి జీవి మానవ రూపంలో కష్టతరమైన దశల గుండా వెళుతుందని, ఒకరి రూపం యొక్క పరిమితులు ఉన్నప్పటికీ స్వీయ-జ్ఞానం ద్వారా సహాయం పొందవచ్చు అని మనకు రామావతారం తెలియజేస్తోంది. అయితే సదా భగవంతుని స్మరణలో వుండే సాధు సత్పురుషుల సమాగమనంలో వుంటే వారి వైబ్రేషన్స్( ఆధ్యాత్మిక తరంగాలు) మనలో ప్రసరించి మనలను పవిత్రులను చేస్తాయి. చెడు స్నేహాలు ఎప్పటికీ మంచిది కాదు. మంచివారికి దగ్గరగా ఉంటూ సన్నిహితంగా మెలగాలి. దుష్టులకు దూరంగా ఉండటం ఎంత అవసరమో, సజ్జనులను కోల్పోవడం అంత బాధాకరం. కాలాన్ని వృథా చేయడం కానీ దుర్మార్గాలతో నింపడం కానీ చేయకుండా నిరంతరం మంచి పనులమీదే ధ్యాస పెట్టాలి. పుణ్యం సంపాదించుకోవాలి. జీవితం శాశ్వతం కాదని, నీటిబుడగ లాంటిదని తెలుసుకోవాలి అన్న మన ఆధ్యాత్మిక వేత్తల మాటలను మనం మన హృదయంలో జాగ్రత్తగా పొందుపరచుకొని తద్వారా మంచి పధంలో పయనించాలి. చెడు సహవాసాన్ని వదులుకోండి;
గొప్పవారి సంస్థలో చేరండి; మరియు
పగలు మరియు రాత్రి పుణ్యకార్యాలు చేయండి.మంచి సహవాసం నిర్లిప్తతకు దారితీస్తుంది,నిర్లిప్తత ఒక వ్యక్తిని మాయ నుండి విముక్తి చేస్తుంది,మాయ నుండి విముక్తి మనస్సు యొక్క స్థిరత్వానికి దారితీస్తుంది మరియు మనస్సు యొక్క స్థిరత్వం విముక్తిని అందిస్తుంది అని భగవాన్ సత్యసాయి అధ్బుతంగా మన కర్తవ్యాన్ని మానవాళికి బోధించారు. 
కామెంట్‌లు