ఆనందానికి మార్గం- సి.హెచ్.ప్రతాప్
 మానవుడే కాక భగవంతునిచే సృష్టింపబడిన ప్రతి జీవీ ఆనందాభిలాషే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ‘ఆనందమయోభ్యాసాత్‌’ అంటుంది శాస్త్రం. అంటే, జీవుడు నిజానికి ఆనందస్వరూపుడే. అందుకే, ఆనందాన్వేషణ అతనికి సహజంగానే ఉంటుంది. అయితే అతను కేవలం శరీరం ద్వారానే ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. కానీ, శరీరం ద్వారా లభించేది సుఖమే గాని ఆనందం కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శాస్త్రాలు ఆనందం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఉపదేశిస్తున్నాయి. మానవుల అపారమైన దుఃఖాలను, క్లేశాలను తొలగించే ప్రశస్తమైన మార్గమే భాగవతం బోధించే ఆధ్యాత్మిక మార్గం. అయితే అది అంత సులభం కాదు. అందరికీ దానిని ఆచరించడం సాధ్యం కాదు. పూర్వ జన్మ సుకృతం వలనో లేక మన సత్కర్మల వలన లభించే భగవంతుని కృప వలనో మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఈ క్రింది వాక్యాలు ఆనందం యొక్క ప్రాశస్థ్యాన్ని తెలియజేస్తాయి.

మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ప్రతికూల ఆలోచనలు ఉన్నప్పుడు ఆనందాన్ని పొందలేరు. జీవితం మీద ఎప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవరూ మనకు శాశ్వతం కాదు. కాబట్టి మీతో ఎవరూ లేకపోయినా, మీరు ఆనందంగా ఉండాలి అని నిర్ణయించుకుంటే కచ్చితంగా ఆనందాన్ని పొందగలుగుతారు.
ఇప్పుడు, నేను చెప్పేదంతా మనసును నియత్రించడం గురించే అని మీరు అనుకోవచ్చు. నేను నియంత్రణ గురించి మాట్లాడటం లేదు. మీరు మీలోని సహజ ప్రక్రియలను యధాతధంగా జరగనిస్తే, ఆనందం ఒక్కటే మార్గం. ఇప్పుడు, ఉదాహరణకి, మీ భౌతిక శరీరం మీకు కావలసినట్లుగా పనిచేస్తేనే, అది మీకు ఉపయోగపడే పరికరం అవుతుంది. లేకపోతే అదొక మంచి శరీరం కాదు, అవునా, కాదా? అలాగే మనసు కూడా. నేను ఇప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటే అది నన్ను ఉండనివ్వాలి. నేను ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు, అది నాకు బాధను కలిగిస్తే, నేను స్ధిరంగా ఉండాలనుకున్నప్పుడు, నాలో అస్థిరతను కలుగజేస్తే, అది ఒక పిచ్చి మనసు, ఒక పనికిరాని మనసు అవుతుంది అని సద్గురు జగ్గీవాస్య్దేవ్ అధ్బుతంగా ఆనందం గురించి తెలియజేసారు.
" నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులైఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచియున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లైతే నా ప్రేమలో నిలిచియుంటారు. నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను. నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి."
ఆనందానికి ఒక ముఖ్య మార్గాన్ని ప్రఖ్యాత సైకాలజిస్ట్ విలియం జేమ్స్ ఈ కింద విధంగా తెలియజెస్తారు:
మీ గుణాలను పెంచుకొని వాటిని ఇతరులతో పంచుకోండి – ప్రతి క్షణం ఆనందాన్ని అనుభూతి చెందడానికి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని మీ మంచి గుణాలను మరియు మీ బలహీనతలను కూడా చెక్ చేసుకోండి. మీ మంచి గుణాలను మెరుగుపరచుకుంటూ వాటితో ఇతరులకు ఆనందాన్ని ఇవ్వండి మరియు మీ బలహీనతలను మార్చుకుంటూ వాటి ద్వారా  ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల అందరి దీవెనలు పొంది సుఖ సంతోషాలతో ఉంటారు.

కామెంట్‌లు