శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే తొమ్మిది రకాల భక్తి మార్గాలలో కీర్తనం వరుసకు రెండో స్థానంలో వున్నా కూదా ఈ కలియుగంలో ఎల్లప్పుడూ ఆచరణీయమైనదని శాస్త్రం చెబుతోంది. బీర్తనంలో ఉన్న గానధర్మం వల్ల మనసు సహజంగానే ఆకర్షితమవుతుంది. ఆ స్థితి కూడా లేని వారికి కనీసం కొంతసేపు సత్కాలక్షేపం చేశామన్న సంతృప్తి అయినా మిగులుతుంది అన్నది అనుభవజ్ఞుల మాట. భాగవతం లో ఒక ముఖ్యమైన ఘట్టంలో
హిరణ్యకశిపుని ఆజ్ఞ ప్రకారం రాక్షసభటులు భయంకరంగా హింసిస్తుంటే ప్రహ్లాదుడు చేసిన పని భగవంతునిపై మనస్సు లగ్నం చేసి భగవంతుడినే జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేసిన సంకీర్తనే. బాధలను భరిస్తూ భగవద్గుణగణగానం చేశాడే కానీ దీనంగా ఏడుస్తూ కూర్చోలేదని పోతనగారు మనకు భాగవతం ద్వారా సందేశం ఇస్తున్నారు.
పరమాత్మకి గానమంటే ప్రాణమట. ఆ శ్రీహరి నామం ఎలా తలచినా ఇంత ఫలితమిస్తుందంటే………ఆయనకు ప్రాణమైన గానాన్నే మనం చేస్తే ఇంకెంత ఫలితమో మనమందరం తెలుసుకోవాలి.
నాహం నాసామి వైకుంఠె యోగినాం హృదయేనచ ల్
మద్భక్తా యత్రగాయన్నిత తత్ర తిష్టామి నారదా ల్ల్
నారదా ! నేను ఎక్కడ ఉంటానో తెలుసునా ? నేను వైకుంఠములో లేను, ఉండను…. నేను తపశ్శక్తి సంపన్నులైన యోగుల హృదయాలలో కనబడను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను…అని శ్రీమహావిష్ణువు స్వయంగా నారదమహర్షికి ఉపదేశించారు. అందుకేనేమో నారద మహర్షుల వారు ఆ నారాయణ నామస్మరణ గానాన్ని వీడకుండా గానం చేస్తుంటాడు. ఈ హరినామ గానం చేస్తే ఆయన ప్రసన్నుడై, ముక్తిని ప్రసాదిస్తాడన్నది అచంచల భక్తుల విశ్వాసం.
పాండురంగ భక్తుడైన నామదేవుడు ఒక సందర్భంలో తాను నమ్ముకున్న దేవుడే నాకు కావాల్సింది ఇస్తాడంటూ భగవన్నామ సంకీర్తన చేయగానే..
అప్పటిదాకా ఆ బావి అట్టడుగున ఉన్న జలం ఉబికి వచ్చి ఆయన దాహం తీర్చిందని పురాణ కథనం. అప్పుడు తెలిసొచ్చింది జ్ఞానదేవుడికి-లోకాన అన్నిటికన్నా నామ కీర్తనే మిన్న అని. ఆ పాండురంగ భక్తుల వలె మనం కూడా సుఖాల్లోనూ, కష్టాల్లోనూ ఆ సర్వేశ్వరుణ్ణి సదా స్మరిస్తూ, ఆయన పట్ల శరణాగతి భావంతో ఉండగలిగితే మన జన్మ నిజంగా ధన్యమైనట్లే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి