బ్రహ్మచర్యం- సి.హెచ్.ప్రతాప్

 బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ భావనను కలిగి ఉండడం అన్నది శాస్త్రవాక్యం.
అన్ని వేదాలు మరియు హిందూ మతం యొక్క ఇతర గ్రంథాలలో బ్రహ్మచర్యం గురించి గొప్ప ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మచర్యం వల్ల అమృతత్వాన్ని పొందవచ్చని విష్ణుపురాణం చెబుతుంది. బ్రహ్మచర్యం గొప్ప సాధన. ఈ లోకంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నా బ్రహ్మచర్యం చాలా అవసరం. ఒక మనిషి సాధారణ స్థాయి నుండి అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేందుకు బ్రహ్మచర్యం క్రమశిక్షణతో  పాటుంచాలి.  బ్రహ్మచర్యం అంటే భౌతిక వాంచలను త్యజించడం. ఆత్మ జ్ఞాన సంపాదనకు ఈ సాధన చాలా అవసరం.నిష్కామంగా చేసే యజ్ఞాల ద్వారా కర్మయోగి చిత్తశుద్ధి పొంది తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అదే ఫలాన్ని (ఆత్మజ్ఞాన్ని) సాధకుడు బ్రహ్మచర్య సాధన ద్వారానూ పొందుతాడు అని శాస్త్రవాక్యం .ప్రతి ఒక్కరూ బ్రహ్మచారి కావాలి, అది జీవనశైలి పరంగానే కానవసరం లేదు, అంతర్ముఖంగా బ్రహ్మచారి కావాలి.దానికి ధ్యానమార్గంలో పయనించడం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ దివ్య మార్గంలో ఉండాలి. బ్రహ్మచారి అంటే కేవలం పెళ్ళి చేసుకోకుండా ఉండటం మాత్రమే కాదు.
బ్రహ్మచర్యం అంటే దేనికీ అంటని గాలిలా ఉండటం. అంటే మీరు దేనినీ కోరుకోరు. ఈ గాలి అన్ని చోట్లకు వెళుతుంది, కానీ ప్రస్తుతం అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అది సముద్రాలను దాటి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఊరికే ఒక జీవంగా ఉండడం - మీరు ఏ విధంగా అయితే జన్మించారో ఆ విధంగా ఉండటం - ఒంటరిగా. ఒకవేళ మీ తల్లి కవల పిల్లల్ని కన్నాసరే, మీరు ఒంటరిగానే పుట్టారు. కాబట్టి బ్రహ్మచర్యం అంటే దైవంతో అతి దగ్గరైన సంబంధాన్ని కలిగి ఉండటం - ఆ విధంగానే జీవించడం అని బ్రహ్మ చర్యం ప్రశస్థ్యం గురించి సద్గురు జగ్గీవాసుదేవ్ ఒక ఆధ్యాత్మిక  గోష్టిలో అద్భుతంగా చెప్పారు.
ఉపనయనం బ్రహ్మచర్యానికి ఆరంభం. ఇది సమావర్తనంతో ముగుస్తుంది. ఉపనయనం నుంచి సమావర్తన వరకు ఉండేది బ్రహ్మచర్యం. సమావర్తనమంటే తిరిగి రావడం. ఎక్కడ బయలుదేరామో అక్కడికే తిరిగిరావడం. విద్యాభ్యాసం పూర్తిచేసి ఇంటికి తిరిగి రావడమే సమావర్తనం.
మనకు తెలిసినంత వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటమే బ్రహ్మచర్యం అనుకుంటాం.అంటే శారీరక సుఖాలపై ఆశ లేకుండా వాటిని అనుభవించక పోవడమే బ్రహ్మచర్యం.మీరు దివ్యపథంలో సాగుతుంటే, మీరు బ్రహ్మచారి. ఆ దివ్యమార్గంలో ఉన్నారంటే మీకంటూ ప్రత్యేకంగా ఎటువంటి వ్యక్తిగత ఆకాంక్షలూ లేవనే అర్థం. ఆ స్థితిలో మీరు ఏది అవసర మో దాన్ని మాత్రమే ఆచరిస్తారు.బ్రహ్మచారులు భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి వంటి వారు. ఆ«ధ్యాత్మిక స్వచ్ఛతను సంరక్షిస్తూ తరతరాలకు దాన్ని అందించే నిస్వార్థపరులు వారు. ఇందుకోసం స్వార్థ చింతన లేని క్రియాశీలురైన కొంతమంది అవసరం.
కామెంట్‌లు