కాశీరాజు పెద్ద కుమార్తె భీష్ముడిపై పగబట్టి శివుని గూర్చి తపస్సు చేసింది." భీష్ముని చంపాలి నేను" అంది.వచ్చే జన్మలో సాధ్యం అని శివుడు వరం ఇస్తాడు.ఆమె వెంటనే అగ్ని లో దూకింది.ద్రుపదుడు అతనిభార్య కోకిలాదేవికి ఆడపిల్ల గా పుట్టింది. ద్రుపదుడి కోరిక ఏంటో తెలుసా? భీష్ముని చంపే కొడుకు కావాలని! ఇక పుట్టిన ఆడపిల్లకి శిఖండి అని పేరు పెట్టి మగవేషంలో పెంచాడు.ద్రోణుని దగ్గర నే చదువుకి పంపాడు.యుక్తవయసురాగానే హేమవర్మ అనే రాజు కూతురి తో పెళ్లి ఐంది.శిఖండి ఆడది అని తెలుసుకుని హేమవర్మ యుద్ధానికి వచ్చాడు.తండ్రి బాధ చూడలేక శిఖండి రాత్రి కి రాత్రి అడవిలోకి వెళ్ళింది ఆత్మ
హత్య చేసుకోవాలి అని.ఇక్కడ విచిత్రం జరిగింది.స్థూలకర్ణుడు అనే యక్షుడు ఆమె కథ తెల్సుకుని" నాకు దివ్యశక్తులున్నాయి.నామగతనం ఓ 10రోజులు నీకు ఇస్తాను.నీవు మగాడివిగా మారి హేమవర్మ దగ్గర నిరూపించుకో! నేను ఆ10 రోజులు ఆడదాన్ని గా ఉంటా" అన్నాడు.సంతోషంగా శిఖండి తండ్రి దగ్గరకు వెళ్ళింది.తన అల్లుడు మగాడు అని ఋజువు కావటంతో మామహేమవర్మ యుద్ధం ఆపి వెళ్లి పోయాడు.ఈలోపల కుబేరుడు స్థూలకర్ణుడు ఉన్న భవంతి దగ్గరకు వచ్చాడు.కానీ అతను బైటికి రాకపోవడంతో కోపం వచ్చి భటుడ్ని పంపాడు." ప్రభూ! శిఖండి కి నామగతనం ఇచ్చి నేను ఆడదాన్ని గా మారి సిగ్గుతో బైటికి రావటంలేదు " అని నిజం చెప్పాడు.కుబేరుడికి ఒళ్లు మండింది." నీవు శాశ్వతంగా ఆడదానిగా ఉండు" అని శపించాడు.అలా శిఖండి శాశ్వతం గా మగాడిగా ఉండి భీష్ముడు యుద్ధం చేయకుండా చేసింది.అలా భీష్ముని అంపశయ్య పై పడేలా చేసింది అంబ.అందుకే బాగా మొండితనం ఉన్న వారిని మొండి శిఖండి అంటారు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి