ఆరోక్లాస్ డింకీ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపాప 6 వక్లాస్ ఫెయిలైంది.అందరిముందు రావటానికి సిగ్గు భయం! అవమానంతో ఆచిన్నారి ముడుచుకుని పోయింది.బాల్యంలో కూడా ఇంటా బైటా మొద్దు పిల్ల అన్పించుకుంది.ఆచిన్నారి పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో పుట్టి పెరిగింది.4వక్లాస్లో సేక్రేడ్ హార్ట్ స్కూల్ లో హాస్టల్లో చేర్పించారు అమ్మ నాన్నలు.ఆపాప పేరు రుక్మిణీ రియార్!6వక్లాస్ ఫేల్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లింది. అంతే! ఓదృఢనిశ్చయానికి వచ్చింది.అంతే 12 వక్లాస్ దాకా బ్రహ్మాండంగా చదివి అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ లో సోషల్ సైన్స్ లో డిగ్రీ పొందింది.ఆపై పి.జి.చేసి గోల్డ్ మెడలిస్ట్ ఐంది. సోషల్ వర్క్ చేస్తూ ఎలాంటి కోచింగ్ సెంటర్లో చేరకుండా స్వయంకృషితో చదివి2011లో యుపి ఎస్సీ పరీక్షలోఆల్ ఇండియా లెవెల్ లో రెండో ర్యాంక్ పొందింది.అది కూడా తొలి ప్రయత్నం లోనే! ఇలాంటి వారే మనకు స్ఫూర్తి దాతలు.ఎవరూ బాల్యంలోనే పువ్వులా పరిమళించలేరు.కష్టేఫలీ! మానసిక దృఢత్వం గట్టి సంకల్పంతో సాధించాలి.కృషితో నాస్తి దుర్భిక్షం 🌹
కామెంట్‌లు