అమ్మ భుజం ; ...కోరాడ నరసింహా రావు !
బిడ్డకు... అమ్మ భుజం పై ఉన్న హాయి..., 
 ఆ స్వర్గములోనైనా దొరుకురుందా..!?

నవమాసాలే, కడుపులో మోసినా... 
 పెరిగి, పెద్దయే  వరకూ... కంటికి రెప్పలా కాచేది, కన్నతల్లిగాక ఇంకెవరు !!

బిడ్డ అవసరాలు ఆ బిడ్డకంటే 
 తనను కన్న తల్లికే ఎక్కువ తెలిసేది !

 కేవలం జన్మ నివ్వటమే  కాదు, 
బాగోగులుచూసేది,భాషనేర్పేది 
అమ్మే... !

బిడ్డ కడుపునిండితే... తన ఆకలి తీరిపోయినంత సంబర పడిపోతుంది అమ్మ.. !!

ఎదుగుతున్న బిడ్డ అభివృద్ధిని చూసి పొంగిపోతుంది అమ్మ !
 
బిడ్డ తనను వీడి పోతున్నా... 
.తానెక్కడున్నా... సుఖసంతోషాలతో ఎల్లకాలం ఆనందంగా ఉండాలని కోరుకునేది కేవలం అమ్మే... !!

అందుకే.... ఈ ఇలలో  తల్లే... 
 తోలి దైవమని కొనియాడ బడుతోంది...* అమ్మ *
.     *******

కామెంట్‌లు