సుప్రభాత కవిత - బృంద
అడుగుకు ఆసరాగా
ఆటంకాలను తొలగిస్తూ
అనుక్షణం తోడునీడై
అనుగ్రహించు దైవమై

అభిలాషల  ఆలాపనలు
అవకాశపు   అన్వేషణలో
అనుభవాలు అధిగమిస్తూ
అనుగమించు నేస్తమై

అనుసరించు దారిచూపి
అభిమానపు చేయందించి
అపేక్షలన్నీ కలబోసి
అనుదినం అభినందిస్తూ

అంతరంగ మిత్రుడిలా
అహర్నిశమూ సహకరిస్తూ
అంతులేని నమ్మకాన్ని
ఆయుధంగా మార్చుకొమ్మని

ఆశ వీడని కోరికలకు
ఆర్తితో ఊపిరిపోస్తూ
అనవసర ఆవేశాలను
ఆలోచనతో ఆపేయమని

కనుల నిండ కలలు నిండ
కలిమి లాగా చెలిమి అండలా
కలత తీరు తరుణమందు
కలిసి వచ్చు  అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు