శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
జగామ సహ మారీచః తస్య ఆశ్రమ పదం తదా |

తేన మాయావినా దూరం అపవాహ్య నృప ఆత్మజౌ |

జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం 
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం 
రాఘవః శోక సంతప్తో విలలాప ఆకుల ఇంద్రియః |
తతః తేన ఏవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం |1-

పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారము తో రామలక్ష్మణులను వారి ఆశ్రమం నుండి దూరముగా పంపి సీత దేవిని అపహరించుకుని పోయెను దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువును గుద్రమును  ప్రాణము  అన్నుబట్టినట్లుగా గాయపరిచెను. పిమ్మట శ్రీరాముడు అవసాన దశలో ఉన్న జటాయును చూచెను.
    ఆ  రావణుడు సీతాదేవిని  అపహరించుకుని పోయిన వార్తను తెలిపెను రామునికి తెలిపి ఆయన పాధ సన్నిధిలో కన్నుమూసెను జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోకసంతప్తులై  విలవిలలాడెను .అట్లుశోకమున మునిగియు శ్రీరాముడు జటాయువునకు అంత్యసంస్కారములను నిర్వహించెను.


కామెంట్‌లు