పిల్లలం మేం పిల్లలం- దుగ్గి గాయత్రి,- టి.జి.టి.తెలుగు,M.A,B.Ed,SET,(Ph.D),-కల్వకుర్తి.
 పిల్లలం మేం పిల్లలం
పసిడి నవ్వుల బాలలం
బుడిబుడి నడకల బుజ్జాయిలం
కల్మషమెరుగని అమాయకులం
పిల్లలం మేం పిల్లలం
భావి భారత పౌరులం
నింగికి ఎగిసే గువ్వలం
జ్ఞానతృష్ణలో తూనీగలం
పిల్లలం మేం పిల్లలం
అమ్మా నాన్నల చిరుదివ్వెలం
అల్లరిచేష్టల చిచ్చరపిడుగులం
మమతానురాగాల మాలికలం
పిల్లలం మేం పిల్లలం
గాంధీజీ బోసి నవ్వులం
చాచానెహ్రూ మెచ్చిన చిన్నారులం
భారతమాతకు భావివీరులం
పిల్లలం మేం పిల్లలం
 (నవంబర్14 బాలల దినోత్సవం సందర్భంగా)

కామెంట్‌లు