పిల్లి పిల్ల - సన తబస్సుమ్ -ఎనిమిదవ తరగతి- ZPHS హవేలీ ఘనపూర్- మెదక్ జిల్లా- 9849505014
  అనగనగా రాయవరం అనే ఊరిలో సునీత, రమేష్ అనే దంపతులు ఉండేవారు. వారికి హారిక, జాను అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరోజు అందరూ కలిసి ఊరి దగ్గర ఉన్న పార్కు దగ్గరికి వెళ్లారు.
                      దారిలో ఒక పిల్లిపిల్లకు గాయం అయి రక్తం కారడం జాను చూశాడు. అందరూ పార్కుకు వెళ్లి ఆడుకొని గంటసేపట్లో తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ ఆ పిల్లి పిల్లకు అయిన గాయాన్ని అందరూ చూసి పోతున్నారు కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. జాను కుటుంబ సభ్యులు కూడా ఇంటికి చేరుకున్నారు. కానీ జానుకు మనసు ఒప్పలేదు. తిరిగి పార్కు వద్దకు పరిగెత్తి ఆ పిల్లి పిల్లకు దెబ్బ తగిలిన చోట గుడ్డతో  కట్టుకట్టి, రక్తం కారకుండా చేశాడు. ఆ పిల్లి పిల్లను తీసుకుని జాను ఇంటికి వచ్చాడు.
                 జాను పిల్లి పిల్లతో ఇంటికి రావడం తల్లి సునీత చూసి పరుగున వెళ్లి పాలు తెచ్చి పిల్లికి తాగిపించింది. జానును దగ్గరికి తీసుకుని అభినందించి, తల్లి నుండి బిడ్డను వేరు చేయడం పాపం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ తల్లి పిల్లి తన బిడ్డ పిల్లి పిల్ల కోసం తిరుగుతూ ఎంత ఏడుస్తుందో అని అన్నది. జాను ఒక్కసారి బాగా ఆలోచించాడు. పిల్లి పిల్లను తీసుకొని మళ్ళీ పార్క్ వైపు వెళ్ళాడు. పిల్లి తన బిడ్డ కోసం అరుస్తున్న శబ్దం విని, అక్కడికి వెళ్లి పిల్లి పిల్లను వదిలేసి, తల్లి బిడ్డలను కలిపి జాను తిరిగి ఇంటికి వస్తాడు. విషయం తెలుసుకున్న వారంతా జానును అభినందిస్తారు.
 నీతి: తల్లి నుండి బిడ్డను ఎవరు దూరం చేయవద్దు. దూరం చేస్తే కలిగే బాధ భరించలేనిది.




కామెంట్‌లు