*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *శతరుద్ర సంహిత --(0300)*
 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

*నందీశ్వర అవతార*చరిత్ర.....

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*

*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*
*సనత్కుమారునితో నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:* 

*సనత్కుమారా!, "నీవు అన్ని విషయాలూ తెలిసిన వాడివి. మహాదేవుని అంశగా జన్మపొందిన నేను, శివుని ఎలా పొందగలిగాను, అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నావు కనుక చెపుతాను, సావధానుడవై విను".* 

*శిలాదుడు అని పిలవబడే ధర్మాత్మడు అయిన ఒక ముని, తన వంశములోని పెద్దల ఆదేశముతో, అయోనిజుడు, సువ్రతుడు, మృత్యువులేని పుత్రుని కోసం తపస్సు చేసి, దేవరాజైన ఇంద్రుని ప్రసన్నం చేసుకుంటాడు. శిలాదుని ఎదుట ప్రత్యక్షమైన ఇంద్రుడు, ఆ మహాముని కోరిక తెలుసుకుని, శిలాదుడు కోరిన వర ప్రసాదం ఇవ్వడానికి తాను అసమర్ధుడననీ, సర్వేశ్వరుడు, మహాశక్తిమంతుడు అయిన మహేశ్వరుని ఆరాధించమని ఉపదేశిస్తాడు, దేవేంద్రుడు.*

*ఇంద్రుని ఉపదేశం పొందిన శిలాదముని, పరమేశ్వరుని అనుగ్రహం కోరుతో సుదీర్ఘమైన తపస్సు చేసాడు. శిలాదముని తపస్సుకు మెచ్చిన శంభుడు ఆతని ఎదుటు ఉమాసహితంగా ప్రత్యక్షం అయ్యారు. కానీ, శిలాదముని తన తపస్సు కొనసాగిస్తున్నడు. అప్పుడు, శంకరుడు, శలాదమునిని, "నీ ప్రార్ధన విని నేను వచ్చాను. లేవయ్యా! శిలాదా! నీ తపస్సు చాలించు!" అని అనేకసార్లు తట్టి తట్టి లేపారు, స్వామి. అప్పడు, శిలాదముని కళ్ళు తెరచి, తన ఎదుట ఉన్న ఉమాపరమేశ్వరులను చూచి, "దేవ దేవా! ఆపద్బాంధవా! అనాధ రక్షకా! మీ వంటి అయోనిజుడు, మృత్యువులేని పుత్రుని నాకు వరప్రసాదంగా, ఇవ్వండి." అని ప్రార్ధించాడు, శిలాదముని.*

*అప్పడు, పరమేష్ఠి శిలాదముని తో " పూర్వము ఒకానొకప్పుడు, దేవతలు తపస్సు చేసి, నేను అవతారము ధరించాలి అని కోరారు. ఆనాటి దేవతల కోరిక ఇప్పుడు తీరుతుంది. నేను నీకు అయోనిజుడుగా, మృత్యువు లేని కుమారునిగా జన్మిస్తాను. అప్పుడు నన్ను, "నందీశ్వరుడు" అని పిలుస్తారు, అని చెప్పారు. ఇలా పలికిన సదాశివుని పాదలకు వినమ్రతతో నమస్కారం చేసాడు, శిలాదముని. భక్తుని అనుగ్రహించిన, పరమశివుడు, కాత్యాయనీ సమేతంగా కైలాసానికి ప్రయాణమయ్యారు.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


Nagarajakumar.mvss

కామెంట్‌లు