శ0కరా.... కరుణా సాగరా...! ;- కోరాడ నరసింహా రావు.

 శ0కరా.... కరుణా సాగరా...! ;
శ0భో...హర-హరమహా దేవ..!!
కరుణించవా ... నను నీ దరి జేర్చవా...! 
 ఈ దీను రాలిపై దయ జూపరావా...! 
 సర్వేశ్వ రా... నీ కృపకు నోచ ని ఈ జన్మము నాకెందుకు...!?
ఈ సంసార చట్రమున నలిగి.. విసిగి, వేసారి యుంటిని...! 
     నాకి0క ఎట్టి మమకార వికారములును లేవు.. సంబంధ బాందవ్యము లనిన వెగటు పుట్టు చున్నది...! 
    నేనిట క్షణ మైన నిలువగ లేకున్నాను
  నను నీలో  ఈ క్షణమే ఐక్యము చేసుకొనవా ప్రభూ !! 
 నా మొర వినవా... నను దయ గనవా...!! కైలాశ వాసా... గంగాధరా... పార్వతీ మనో హరా... నాగ భూషణ... నంది వాహన...చంద్రమౌళి..చర్మా0బ రధారి...! త్రిసూల పాణి... త్రినేత్రధారి.. యోగీశ్వరా...!! 
     నా కన్నీటితో నిన్నభిషేకిం చుచుంటినే ... నీ మనసు కరగలేదా బోలా శ0కరా....!! 
     ********
    ...
కామెంట్‌లు