ఇంతే గా... మనిషి జీవిత0..! - కోరాడ నరసింహా రావు..!
 గణితదినోత్సవసుభాకాంక్షలతో
        ***********************
సృష్టి సమస్తమూలెక్కల మయమే..! 
 మరీ ముఖ్యంగా.... మనిషి జీవితమే ఓ పెద్ద లెక్కల పుస్త కం...! 
 కొందరు దంపతులు క్రమ భిన్నా లైతే... మరి కొందరు అప క్రమ భిన్నాలు..! 
  పిల్లలతో కలిసి అన్నిజంటలూ
 మిస్రమ భిన్నాలే...! 
 పుట్టుకకు అందరూ...బిందువుతోనేమొదలై.. X- y లు... ప్లస్ - మైనస్ లై
...ఈ భూమి మీదకు వచ్చి ... 
వివాహంతో ఇరువురూ ఒకే సరలరేఖై.. పిల్లలతో త్రిభుజాలై
కోడలు, అల్లుడితో చతురస్రాలై
మనుమలు- మనుమ రాండ్రతో
దీర్ఘచతురస్రాలుగామారిపోతూ
 కావాలి అనుకున్న వారిని కలిపేసు కుంటు... వద్దను కున్న వారిని తీసివేసేస్తూ... ఆశల గుణ కారాలతో ఎంతో ఊహించు కుని.... చివరకు, ఒక్కొక్కరూ  ఒక్కో భాగ హార మై పోయి... తమను తాము నిశ్సేష0 గా  భాగించేసు కుని
సున్న( 0)  గా మిగిలి పోవటమే కదా... మనిషి జీవితం...!! 
      ******

కామెంట్‌లు