హైదరాబాద్ లో వీక్షణం(కాలిఫోర్నియా) 136వ తెలుగు సాహిత్య సమావేశం - ప్రముఖ కవయిత్రి డా.కె.గీత ఆంగ్ల పుస్తకావిష్కరణలు!

 వీక్షణం(కాలిఫోర్నియా) సాహితీ వేదిక ఆధ్వర్యంలో జరగనున్న 136 వ సమావేశంలో ప్రముఖ కవయిత్రి డా.కె.గీత గారి ఆంగ్ల పుస్తకాలు Centenary Moonlight and other poems, At the Heart of Silicon Valley (Short Stories) ఆవిష్కరణ ప్రముఖ సినీనటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారి చేతుల మీదుగా డిసెంబరు 13, 2023 బుధవారం సాయంత్రం 6గం. నుండి 9గం.ల వరకు ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగం పల్లి, నల్లకుంట, హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ సభకు అధ్యక్షత తెలంగాణా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ కందుకూరి శ్రీరాములు వహిస్తుండగా, ముఖ్య అతిథిగా మ్యూస్ ఇండియా చీఫ్ ఎడిటర్ శ్రీ ఆత్రేయ శర్మ విచ్చేయనున్నారు. వక్తలుగా  ప్రముఖ కవులు, రచయితలు, అనువాదకులు   శ్రీ వసీరా, శ్రీ ఎలనాగ,  డా. ఆలపాటి ట్యాగ్ లైన్ కింగ్, శ్రీమతి శ్రీసుధ కొలచన, శ్రీ వి. విజయకుమార్  రానున్నారు. ఇందులో దాదాపు నలభై మంది కవుల కవిసమ్మేళనం కూడా జరగనుంది. కవిసమ్మేళనాన్ని డాక్టర్ రాధా కుసుమ గారు  నిర్వహిస్తారు. శ్రీమతి విశ్వైక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సాహిత్యాభిలాషులందరికీ  వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి (యూ.ఎస్.ఏ), వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్  ఆహ్వానం పలుకుతూ సభను జయప్రదం చెయ్యవల్సిందిగా కోరుతున్నారు. 
కామెంట్‌లు