తిరుప్పావై ప్రవచనం‎ - 3 వ రోజు;--వరలక్ష్మి యనమండ్ర
భగవంతుని మూడో స్థానం - విభవం(అవతారములు)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️పాశురము

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
***********
మూడవ పాశురము - భావము- పంచపదులలో.
**********

మత్స్యముగ,కూర్మావతారంగను
వరాహావముగ, నారసింహునిగను
కల్కి, కృష్ణ,  పరశురామునిగను
రామ, నారాయణ,వామనునిగను
దశావతారములుగ ధరణిని వెలసె... కృష్ణా

మూడవ రోజు వామనుని కొల్చినది
నామ స్మరణమే పాప హరణమన్నది
హరి నామాన్ని మనం పాడుదమంది
ధరణిలోని జనులకు ధర్మం తెలిపింది
నేడు వామనుని కొలవమని చెప్పినది..కృష్ణా

ఒక పాదం కడిగిన నీరు భువికి చేరింది
రెండడుగులకే వారి వ్యాప్తి తెలిసినది
రెండవ పాదము బ్రహ్మచే కడిగబడినది
మూడో అడుగు బలి శిరమున పెట్టబడింది
బలి అహంకారము పటాపంచలయినది.. కృష్ణా

ఫలితము

అయ్య నామ స్మరణము చేయండీ
ఎటువంటి బాధలు దరికి రావండీ
నామ స్మరణమే పాపహరణమండీ
విశ్వాసం ఉంచి మీరు పయనించండీ
పరలోక ప్రాప్తి మీరు పొందెరండీ... కృష్ణా 


కామెంట్‌లు