-తిరుప్పావై 4.పాశురము : - వరలక్ష్మి యనమండ్ర- అద్దంకి, బాపట్ల జిల్లా
ఆళి మళైక్కణ్ణాః ఒస్ట్లు నీ కైకర వేల్ ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్జ దిర్ న్దు తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్ వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్ మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.
***********
నాల్గవ పాశురము - భావము- పంచపదులలో
***********
నాల్గవ పాశురమునకు భావము

ఓ వర్ష నిర్వాహకుడా! ఓ పర్జన్య దైవమా!
గంభీర స్వభావం గల ఓ మేఘమా!
నీ దాతృత్వములో ఔదార్యము చూపుమా!
సంద్రం లోని నీటినంతయును త్రాగుమా!
నీలాకాశమంతయూ నీవు వ్యాపించుమా!... కృష్ణా

విష్ణుమూర్తి కుడిచేతి చక్రం వలె మెరయుము
విష్ణుమూర్తి ఎడముచేతి శంఖం వలె ఉరుముము
విష్ణుమూర్తి ధనువున బాణములవలె కురియుము
లోకమంత సంతసించు విధముగా మురియుము
మా మార్లశిర స్నానము కొరకు నీవు వర్షించామా!.. కృష్ణా

ఫలశృతి
ఈ వ్రతమునకు ప్రధానమైనది స్నానము 
స్నానమునకు ముఖ్యమైనది జలము
జలము యన్న సమృద్ధిగ పండు ధాన్యము
ధాన్యమున్నచో ప్రజలకు సుఖ జీవనము
దీనికి పరమాత్మడు కృష్ణుడే ఉపాయము... కృష్ణా
***********


కామెంట్‌లు