తిరుప్పావై ;-5.పాశురము- వరలక్ష్మి యనమండ్ర


మాయనై మన్ను, వడమదురై మైన్దనై త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై త్తాయైక్కుడల్ విళక్కమ్ శెద్ద దామోదరనై తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తాళుదు వాయినాల్ పాడి, మనత్తినాల్ శిల్టిక్క పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్ తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

**********

5వ పాశురము - భావము- పంచపది ప్రక్రియ

***********

ఐదవ రోజు పాశుర భావము


మధురా నగరపు నివాసుడు

యమునా తీరాన నడయాడువాడు 

ప్రకాశించు శుభకర దీపమతడు

వింత వింత చేష్టలు చేయువాడు

యశోద చేతబంధింప బడినాడు.. లక్ష్మీ


అటువంటి భగవంతుణ్ణి

పవిత్ర పుష్పములతొ పూజించండి

మనస్పూర్తిగా మీరు ధ్యానించండి

భక్తితో భగవన్నామము తలవండి 

మీరు చేసిన పాపాలు పోతాయండి

అని చెప్పెను గోదాదేవి గోపిలకు... లక్ష్మీ



అహింస, ఇంద్రియ నిగ్రహములు

క్షమయునుతపస్సు  సత్యములు

సర్వభూతదయ మరి జ్ఞానములు

సత్యమనునవి ఎనిమిది పుష్పాలు

వీటితో పూజించి కృపను పొందండి.. లక్ష్మీ

***********


కామెంట్‌లు