అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 శివ నాగిరెడ్డి గారు అప్పటికే సగం ప్రయాణంలో ఉన్న ఎందుకైనా మంచిదని విధ్వాన్ జ్యోతి చంద్రమౌళి గారికి ఫోన్ చేశారు  ఆయన వెంటనే స్పందించి సార్ ఇప్పుడు ఉదయం 4:30 అవుతుంది మీరు ఆరు గంటలకు రండి మనం ఏడు గంటలకల్లా ధర్మవరం వెళదాం తర్వాత అద్దంకి వచ్చి టిఫిన్ తిని అద్దంకిలోని చారిత్రిక కట్టడాలు శిల్పాలు, శాసనాలను చూద్దాం అన్నారు  రెడ్డిగారు అప్పుడే చిలకలూరిపేట దాటి మార్టూరు చేరువలో ఉన్నారు ఈసారి అద్దంకి, ధర్మవరం మణికేశ్వరం కుదిరితే దర్శి వెళదామని అనుకుంటున్నారు కనిపించింది గారికి ఫోన్ చేస్తే రామ్ నగర్ సెంటర్ కు రండి నేను ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను అన్నారు  ఆయన వచ్చిన తర్వాత మసక చీకట్లోనే కారులో ప్రకాశం జిల్లా మ్యాప్ తెరిచి పోవాల్సిన ఒకసారి చూసుకున్నాము. రెడ్డి గారు  పొట్టి శ్రీరాములు సెంటర్లో అల్లం చాయ్ తాగి మంచి ఉత్సాహంతో బయలుదేరారు బృందం తెల్లటి బట్టల్లో నల్లటి చంద్రమౌళి గారి మెరిసిపోతున్నారు మాచర్ల చెన్నకేశవులు పోలిన  తన తెల్లని మీసాలను సవరించుకుంటూ మురిసిపోతున్నారు. ఆయన  ప్రాచ్య  భాషలో మాస్టర్ డిగ్రీ చేశారు
తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేశాడు  సాహిత్యం తో పాటు చరిత్రపై మమకారం పెంచుకున్నారు తిరిగే కాలు ఊరుకోదన్న సామెతను నిజం చేస్తూ ప్రకాశం జిల్లా అంతా గాలించి చరిత్ర పరిశోధకులు అయ్యారు. 2004లో అద్దంకి చరిత్ర 2008లో ప్రకాశం జిల్లా దర్శనీయస్థలాలు 2019లో కొణిదెల చరిత్ర శాసనాలు 2020లో ప్రకాశం జిల్లా ప్రాచీన చరిత్ర అంతకుముందే ఆంధ్ర ప్రదేశ్ లో బౌద్ధ క్షేత్రం  బౌద్ధ క్షేత్రాలు అన్న పుస్తకాన్ని రాసి తాను విన్నంతా కన్నాంతను ఉన్నంతలో  నలుగురికి పంచిపెట్టారు. ధర్మవరంలో ఇనుప యుగపు సమాధులు నాశనమై పోతున్నాయి మీరు వచ్చారంటే వాటిని ఎలాగైనా కాపాడుకోవచ్చు అని నిన్నటి రోజున నాకు ఫోన్ చేసినప్పుడు వారసత్వ సంపద పరిరక్షణ పట్ల ఆయన ఎంత ఉబలాటపడుతున్నారో అర్థమైంది రెడ్డి గారికి. ఇదిగో వచ్చేస్తున్నానని ఊరించి అనుకున్నట్టుగానే అద్దంకి చేరిన రెడ్డి గారిని చూసి ఆయన ఎంత సంబర పడిపోయారో  చెప్పలేం  ధర్మవరం వైపు వెళుతున్నారు రెడ్డి గారు సినీ నటుడు ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక మండల అధ్యక్షుడుగా పనిచేసిన ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఆ రోజుల్లో రెడ్డి గారిని ఆయన ఆఫీసుకు పిలిపించుకొని ధర్మవరం గురించిన చారిత్రికతను చర్చించుకున్నారు  అద్దంకిలో ఎర్ర ప్రగడ విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా రెడ్డి గారి నిరమ్మన్నారు  ఆ తర్వాత ధర్మవరం వెళ్దాం అన్నారు ఆయన లేడు  అయినా ఆయన మాటలు వినపడుతూనే ఉన్నాయి  ఇంతలో ధర్మవరం చేరుకున్నారు రెడ్డిగారు.


కామెంట్‌లు