అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 నిరుత్సాహంతోనే ముగ్గురు ధర్మవరంలో తూర్పుదిక్కున పొలాల్లో ఉన్న శిథిల భీమేశ్వర ఆలయం వైపు వెళ్లారు.  సగం పడిపోయిన 12 వందల ఏళ్ల ఆలయాన్ని చూసి విలపించాలో లేక సమీప పట్టణాల్లో అమ్మడాలంటే అటునాతన భవంతుని చూసి ముచ్చట పడిపోవాలో తెలియక తికమక్కపడుతున్న రెడ్డి గారికి ఒక చిన్న ఆలయం గోడకు ఆనించిన పార్శ్యనాథ విగ్రహం భీమేశ్వరగ్రహం ముందు గోడ ప్రక్క మహిషాసుర మర్దని విగ్రహం ఆలయంలోపల శివుడు కొలువై ఉన్నాడని చెప్పకనే చెబుతున్న ఓపిక లేక ఒత్తి గిరిన నంది విగ్రహాలు  కొంత ఊరట నిచ్చాయి. అంతలో చంద్రమౌళి గారు అందుకుని ఈ ఆలయం ముందు పొలం దున్నుతుంటే 24 జైన తీర్థంకరులను అందంగా చెక్కిన జైన శిల్పం బయలుపడగా దాన్ని హైదరాబాద్ స్టేట్ మ్యూజియంకి తరలించికెళ్లారని చెప్పారు.
అంతేకాదు రేంగి చాణుక్యరాజు అయిన గుణ గవిజయదిడ్యుని విజయాన్ని సైన్యాధ్యక్షుడు అద్దంకి పాండురంగడు ఈ ధర్మవరంలో ఉన్న  తన గురువైన ఆదిత్య భట్టుకు కొంత భూమిని దానం చేసినట్లు క్రీస్తుశకం 850 ఏళ్ల నాటి కడియరాజు శాసనం వల్ల తెలుస్తుందని కూడా చెప్పాడు అయితే ఈ భీమేశ్వర ఆలయం చాళుక్య భీముని కాలంలో నిర్మించబడి ఉంటుంది తరువాత పండ రంగని ముని మనుమడు దుగ్గరాజు ఆ ప్రాంత పాలకుడిగా రెండో అమ్మరాజు కాలంలో ధర్మవరంలో కటకాభరణ జినాలయాన్ని నిర్మించినట్లు ఆలయ నిర్వహణకు మలియం పూడి గ్రామాన్ని అమ్మరాజు చేత దానం చేయించిన శాసన ఆకారాలు ధర్మవరంలోనే ఉన్నాయి  ధర్మవరానికి జన ధర్మవరం అనే మరో పేరు కూడా ఉంది అయితే ధర్మవరంలోని పండరంగని శాస్త్రం తెలుగు భాష పరంగా ప్రాధాన్యతను సంతరించుకొని కూడా చంద్రమౌళి గారు చెప్పారు
ఇక అక్కడినుంచి కారెక్కి ఊర్లో ఉన్న సీతారామాలయానికి వెళ్లారు రెడ్డి గారు 897లో ఇంచిన శాసనాన్ని ఆలయంలోని భిన్నమైన వర్ధమాన మహావీర అమ్మవారు చెన్నకేశవ విగ్రహాలను చూశారు. ఒకప్పుడు రాజ పోషణలో జరిగిన జైనశైవ మతసామరశ్య కేంద్రంగా దాసులైన ధర్మవరం ఆ తర్వాత కొనిదెనచోళులు రెడ్డి రాజులు, విజయనగర పాలకుల ఆదరణ చవి చూసింది గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్షా అధినంలో కొచ్చిన ధర్మవరం గ్రామాన్ని నిర్మించి అప్పటివరకు ఉన్న ధర్మవరం  అనే పేరు కాదని అతని  ఎకలస్కాన్ తన పేరిట ఏకలస పురం అనే కొత్త పేరు పెట్టారు ఆ సంగతి  ని తెలియజేసే శాసనం రామాలయం ముందు నిలబెట్టి ఉండి అందులో అతడు గ్రామంలో కల్పించిన వసతులు నీటిపారుదల సౌకర్యం పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి ప్రజల అభిమానాన్ని సంపాదించిన వివరాలు ఉన్నాయి.



కామెంట్‌లు