అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ధర్మవరాన్ని గురించి ముగించే ముందు ఇప్పటికీ జనంలో నానుతున్న కాటమరాజు కథలలో పల్లికొండ యలమంచి నుంచి వెళుతూ ధర్మవరంలో ఆగి కొలిచిన స్వామి భీమేశ్వరుడా చెన్నకేశవుడా అనే ఆలోచనలో పడ్డారు రెడ్డి గారు అప్పటికే ఉదయం 9:30 అయింది మన పొలం మనం చేసుకుంటూ ఉంటే ఆకలి తన పనిగా నిశ్శబ్ద సంకేతాలు ఇస్తుంది ధర్మవరం నుంచి 20 నిమిషాల్లో అద్దంకి చేరుకొని వేయి స్తంభాల గుడి దగ్గర హోటల్లో టిఫిన్ చేస్తూ చూడవలసిన వాటి గురించి ముచ్చటించుకుంటున్నారు  అద్దంకి అనగానే మనకు పండురంగడు అతని శాసనం గుర్తుకొస్తాయి అద్దంకి అనగానే అప్పుడెప్పుడో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఆత్మగౌరవంతో పుట్టుకొచ్చిన స్వతంత్ర పాలకుడైన రెడ్డి రాజులు గుర్తుకొచ్చారు.
ప్రజల్ని పర పీడనం నుండి కాపాడి స్వేచ్ఛా వాయువులను   పీల్చే అవకాశాన్ని ఇచ్చి అద్దంకిని రాజధానిగా తీర్చి దిద్ది రెడ్డి రాజ్యానికి పురుడు పోసిన నేపథ్యం గుర్తుకొచ్చింది రెడ్డి గారికి గుండ్లకమ్మ చేయడంలో కమ్మని పంట పొలాల నడుమ ఎతైన కోట సౌధాలు చూడ చక్కటి ఉద్యానవనాలు కవులు కళాకారులతో భూతల స్వర్గాన్ని తలపించింది అద్దంకి అన్న సాహితీ వర్ణనలన్నీ కళ్ళ ముందు కదలాడాయి అద్దంకి మహానగరంలో ప్రోలయ వేముడు నిర్మించిన నగరేశ్వర కమటేశ్వర గణపతి ఆలయాలను చూడాలనుకున్నారు ఇంతలో చంద్రమౌళి గారి అందుకొని ఒక సమకాలీన గ్రంథంలో అద్దంకి నగర వర్ణాలను వినిపించిన తరువాత ఆసక్తికరమైన సంగతి చెప్పారు అదేమిటంటే అద్దంకి నగరంలో వారవనితలు తన వెంట్రుకలు చీకటిలో కలిసిన మంగళకర రాత్రి కలవారు. నుదురు అనే చంద్ర రేఖతో ప్రకాశించే విదియ వంటి వారు కనుబొమ్మలనే లతల సొబగుల లాస్యం యొక్క మనోహర రంగస్థలం వంటి వారు కళ్ళు అనే చేపలతో కలిసి ఉన్న మన్మథ పతాక వంటి వారు అధరమనే బందూక పుష్ప విలాస సంతి విభ్రమ మందిన  శరత్ కాలం వంటి వారు శంఖాల్లాంటి అందమైన మెడ కలిగిన వారు చక్రవాక పక్షి జంటల ఉన్న స్థనలతో శృంగారం అనే భావి వంటి వాడట వింటుంటే మధన క్రీడోత్సాహ పీడితులై మట్టివాడలో మంచన శర్మ టిట్టి మశెట్టి వారకాంతల కోసం పడ్డ తిప్పలు గుర్తు చేసుకున్నారు రెడ్డి గారు టిఫిన్ ముగిసింది  ఇక అద్దంకి నగర పర్యటనకు బయలుదేరారు. చంద్రమౌళి గారే వారికి టూరు గైడ్  ముందుగా రెడ్డి రాజులు కుల దైవంగా భావించి పూజించుకున్న నందికంత పోతరాజు అనే కటారికి ఆయుధం అద్దంకి గల అనుబంధం ఆపైన ఆ కత్తి అద్దంకి నుంచి కొండవీడుకు రాజధానితో తరలి పోయిన వైనం.


కామెంట్‌లు