అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961
 పాత శివాలయంలో చారిత్రక శాసనానికి సున్నం కొట్టి అక్షరాలు కనిపించకుండా చేయడం మరింత బాధను కలిగించింది రెడ్డి గారికి  ఒకనాటి పౌరుషానికి ప్రతీక గ్రామంలో కోట దెబ్బ దిగులుగా మూలుగుతూ ఉండడం రెడ్డి గారిని మరింత కృంగతీసింది నీలిమందు తయారి తొట్లు గుట్టుచప్పుడు కాకుండా  మాయమవడం తట్టుకోలేని నిజం ఇన్ని బాధల మధ్య వేంగి చాళుక్య రాజు గుణగ విజయాదిత్యుని సేనాని అద్దంకి పండురంగడు తరువోజ వృత్తంలో  వేయించిన క్రీస్తు శకం 848 శాసనం రెడ్డి గారి మదిలో మెదిలి కొంత ఊరట తెలుగు సాహిత్య చరిత్రకు కొట్టంగట్టనే విషయం గుర్తుకొచ్చి బడిపంతా ఉపశమనం కలిగినది  ఈ యాత్రలో శివనాగి రెడ్డి గారికి కనిపించిన అనేక  వింతలు విశేషాలు  మనకు తెలియజేశారు. స్త్రీని వర్ణించాలి అంటే ఆ రోజుల్లో  శ్రీనాధునికి ఉన్న ప్రతిభ మరి ఎవరికీ లేదు అని తెలియచేస్తారు. కాశీ ఖండాన్ని ఎంత బరువుగా వ్రాశారో  నైషధాన్ని అంత శృంగారభరితంగా వ్రాసిన ఘనత  ఒక్క శ్రీనాధునికే దక్కుతుంది  అలాగే చారిత్రాత్మక విషయాలలో నిష్ణాతులైన శివ నాగిరెడ్డి గారు  భాషాపరంగా ప్రతి అక్షరాన్ని తూచి తూచి వాడడం  తెలియడంతో పాటు   చదువరులకు ఆనందాన్ని కలిగించడానికి  కొన్ని చమక్కులు  కూడా ఉపయోగించడం విశేషం స్త్రీ వర్ణన శ్రీ నాథుడు  పద్య రూపంలో చెబితే గద్య రూపంలో రెడ్డి గారు అంతకుమించి  అందంగా  శృంగార పరంగా చెప్పడం విశేషం  ఈ విషయంలో వారిని అభినందించక తప్పదు.
ఈ పర్యాయం తెలంగాణలో ఒక చారిత్రక ప్రదేశాన్ని చుట్టి రావాలనిపించింది రెడ్డి గారికి  తెలంగాణలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి ఎక్కడి  కి వెళ్లడం  తెలుగువారి తొలి రాజధాని కోటిలింగాల శాతవాహనుల మలి రాజధాని కొండాపూర్  ఇక్ష్వాకుల కాలంలో నాగర్జున కొండకు సరితూగే ఏలేశ్వరం విష్ణు కుండినుల రాజధాని కీసరగుట్ట బాదామి చాళుక్యుల సాంస్కృతిక రాజధాని అలంపురం రాష్ట్ర కార్యాల తర్ఫీదు కేంద్రాలు కళ్యాణ చాళుక్యులు ఉపరాజ దానులు పట్టణ చెరువు గంగాపురం సమకాలీనంగా  వేములవాడ చాళుక్యుల రాజధానులు వేములవాడ కందూరు చోళుల కోడూరు పానకల్లు రేచర్ల రెడ్ల పిల్లల మర్రి కాకతీయుల రాజధానులు అనుమకొండ వరంగల్.


కామెంట్‌లు