అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 వారి సామంతులు గోనవంశపు రెడ్ల రాజధాని వర్ధమానపురం  పొలవాన పాలకుల పలాస చెరుకురెడ్ల జలాల్ పురం మల్యాల వంశీయుల కొండపర్తి మిర్యాల వారి కటుకూరు రేచర్ల వెలమ (పద్మనాయకు)ల ఆమనగల్లు రాచకొండ దేవరకొండ ఇలా కుతుబ్షాహీలు వచ్చేంతవరకు తెలంగాణని ఎంతో మంది రాజులు చక్రవర్తులు సామంతులు పాలించిన చారిత్రక స్థావరాలు  కోకొల్లలు అన్నీ కలిపి ఒక్కసారి రెడ్డి గారి చుట్టూ ముసురుకున్నాయి. ఏ ఊరు వెళ్లడం ఏ ఊరు వెళ్లకపోవడం నిర్ణయంలో  ఊగిసలాడుతుంది రెడ్డి గారి మనసు ఊళ్లన్ని దోబూచులాడుతున్నాయి శేష భిషల మధ్య తెలంగాణ తెలుగు చోళ వంశానికి చెందిన కందూరు చోడుల పాలనా కేంద్రం కందూరు వైపు మనసు మొగ్గు చూపింది. ప్రముఖ చారిత్రక శాసన పరిశోధకులు బి.ఎన్.శాస్త్రి గారి కందూరు చోళుల శాసనాల చరిత్ర సంస్కృతి గుర్తుకొచ్చింది. రెడ్డి గారికి కందూరు పోవడానికి నిశ్చయించుకున్నారు. కందూరికే ఎందుకు వెళ్లాలంటే కావేరీ నది తీరంలోని చూడవలసికులు తెలుగు నేలపై సామంత రాజులుగా పాలించటనా వారిని పిడుగు చోడు(లు) అని పాలించిన రాజధాని పేరును పిలిచారు అలాంటి సామంత రాజులు కందూర్ నుంచి పాటించడానికి కందూరు చోళులు అని పిలిచారు. నెల్లూరు నుంచి కొణిదెల నుంచి 23 నుంచి పొత్తటి నుంచి పాలించటన వారిని ఆయా పేర్లతో పిలిచారు. కందూరు చోళులు ముందుగా కోడూరు నుంచి తర్వాత కందూరు నుంచి  కందూరు నాడు (నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల)ను 
క్రీస్తు శకం 1033 నుంచి క్రీస్తు శకం 1248 వరకు కళ్యాణ చాళుక్య కాకతీయులకు సామంతులుగా పాటించారు వీరి వంశ మూలపురుషుడు ఏరువ భీముడు  (క్రీస్తు శకం 1025 నుంచి 1050) తర్వాత వరుసగా తొండ (క్రీస్తు శకం 1050-1075) రెండో  భీమ చోడ (క్రీస్తు శకం 1075-1090) మల్ల (క్రీస్తు శకం 1093-1100) ఉదయన (క్రీస్తు శకం 1100-1104) మూడవ భీమ చొడుడు (క్రీస్తు శకం 1104 1125) మొదటి గోకర్ణ చోడ (క్రీస్తుశకం 1125-1128) శ్రీదేవి కొండ (క్రీస్తు శకం 1125-1129) రెండో ఉదయన (క్రీస్తు శకం 1136- 1176) 4వ బీమా చోడ (క్రీస్తు శకం 1176-1235) రెండో గొకరణ  (క్రీస్తు శకం 1176-1248)  పాలించారు. మహబూబ్ నగర్ నుంచి రాయచూరు పోయే దారిలో గల కోడూరులో మొదట కోట కట్టుకుని పాలించారు.


కామెంట్‌లు