అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 బస్సులో గానీ రైలులోగాని వెళ్లే వారికి ఇప్పటికీ ఆ కోట కనిపిస్తూ వెయ్యేళ్ల చరిత్రను చకచకా గుర్తుచేస్తుంది కందూరులో కూడా ఒక కోట ఉంది  రెడ్డిగారు 2001-2003 మధ్య భూత్పూర్ లో గోనబుద్ధారెడ్డి కూతురు కట్టించిన రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కందూరు  కోటను చూశారు చెరువు కట్ట పైన ఇప్పటికీ చూడవచ్చు ఆ దృశ్యాన్ని. బయలుదేరి షాద్ నగర్ దాటేసరికి నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు గారు ఫోన్ చేశారు రెడ్డిగారు కందూరు వెళుతున్నారని చెప్పగానే తాను వస్తానన్నాడు ఆయన కొత్తూరు నుంచి రాగానే కందూరు పోవడానికి కారులో బయలుదేరారు రెడ్డి గారు బాలానగర్ కు ప్రక్కనే ఉన్న బూరుగుల హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి (బూర్గుల రామకృష్ణారావు గారి ఊరు) గ్రామ శివారులో  ఒక గుడి శిథిలావస్థలో ఉంది చూద్దామన్నాడు.రెడ్డి గారికి శిధిలాలు అంటే ఇష్టం పదిరపరచడం మహా ఇష్టం ఎందుకంటే వాటి గురించి పత్రికల ద్వారా తెలియజేస్తే ఎవరో ఒకదాత ముందుకొచ్చి బాగు చేయించక పోతారా అని ఒక ఆశ  ఒక పది నిమిషాల్లో బూరుగుడ గుడికెళ్ళారు కారు దిగుతుంటేనే శిథిలాలను చూసి బాదేసింది కేవలం గోడలు కప్పు పడిపోయి మండపంతో ఉన్న ఒక మొండి గుడి కనిపించింది దగ్గరకండి చుట్టూ తిరిగి చూస్తే అది ఒక   త్రికోటాలయామని  మూడు వైపులా గర్పాలయ అర్ధమండపాలతో ముందున్న గుళ్ళు ఉన్న ఆనవాళ్లు మధ్యలో చదరంగా 16 స్తంభాల రంగ మండపం నాలుగో వైపులా నాలుగు ద్వారాలు దక్షిణ వైపు ఒక ప్రవేశ ద్వారం (మిగిలిన మూడు ఆలయాల అర్ధ మండప ద్వారాలు) కనిపించినాయి. పశ్చిమ వైపు ఉన్న ఆలయం మాత్రం అర్థమండపంలో ఒక శివలింగం ప్రతిష్టించబడి గర్భాలయ ద్వారంలో భైరవుని విగ్రహం ఉంది. గర్భాలయం పునాదిగుంది గాని పైన రాళ్లు లేవు మిగతా రెండు ఆలయాలు గర్భాలయ హస్త మండపాలను ఎవరో ఎప్పుడో ఒడుచుకుపోయారు మళ్ళీ బాగా చేసింది రెడ్డి గారికి ఆలయ వాస్తు దోరమంతా శిల్పాలు మండపంలోని నంది శివలింగం భైరవ శిల్పాలు కాకతీయ వాస్తు శైలికి అర్థం పడుతున్నాయి ఇంతలో ఆ ఊరి సర్పంచ్ కుమార్ గారు వచ్చారు అతనికి ఆలయం 800  సంవత్సరాల నాటిదని కాపాడుకొని తర్వాతి తరాలకు అందిస్తే బాగుంటుందన్న రెడ్డి గారి అభిప్రాయానికి వంతపలికి మేము అదే ప్రయత్నంలో ఉన్నాము అన్నారు  బూడుగుల రామకృష్ణారావు గారి అన్న కూతురు ఆలయ స్థానిక ఎమ్మెల్యే శాఖకు ఉత్తరం రాయగా ఆదాయం లేనిదే ఆలయాన్ని పునరుద్ధరించడం కుదరని తెలంగాణ వారసత్వ (పురావస్తు శాఖ)ను సంప్రదించమని ఉచిత సలహానిచ్చే తప్పుకుంది  దేవాదాయ శాఖ.


కామెంట్‌లు