అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,- చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 పట్టు వదలని ఎమ్మెల్యే మళ్లీ పురావస్తు శాఖకు మరో లేఖ వ్రాయగా ఆ దేవాలయం మా రక్షిత కట్టడం కాదని మేమేం చేయలేమని చేతులు దులుపుకుంది తెలంగాణ వారసత్వ శాఖ ఇలా రెండు శాఖల దోబూచులాటలో కొట్టుమిట్టాడుతున్న బూరుగుల కాకతీయ దేవాలయం యధావిధిగా తన ఉనికిలో తాను మిన్నకుండిపోయింది ఇంకేం చేస్తుంది మరి మడి లేదు మాన్యం లేదు ఎవరికి పట్టలేని అనదాల అలాగే ఉండిపోయింది నల్లమల నేచర్ ఫౌండేషన్ కృష్ణంరాజు గారు చుట్టు ప్రక్కన చిన్న చిన్న పరిశ్రమల వారిని ఖర్చులో కొంత భరిస్తాము అన్నారు అన్నమాట విని ఆ శిథిలాలయం మదిలో ఆనందం తొంగి చూసింది  సర్పంచి కుమార్ కల్పించుకొని గ్రామస్తులం కూడా చందా లేసుకుంటాం ఎలాగైనా ఈ ఆలయానికి గత వైభవం తీసుకొద్దామని చెప్పడంతో రెడ్డి గారికి కూడా కొంత ఊరట కలిగింది ఎక్కువగా ఖర్చు కాదు పడిపోయిన రాళ్ళను యధాతధంగా వాడుకోవచ్చని ఒలుచుకుపోయిన మూడు గర్భాలయాల మండపం కప్పులకు మాత్రం కొత్తగా కావాలని చెప్పారు రెడ్డి గారు ప్రభుత్వం చేయూత దక్కనందున విరాళాల ద్వారా బాగు చేయిస్తే తాను పూనుకుంటాను అన్నాడు సర్పంచ్ దానికి తోడుగా కృష్ణంరాజు గారు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తానన్నాడు మళ్ళీ మరో శిధిలాలయం పదిలమవుతున్నందుకు రెడ్డి గారికి ఎంతో ఆనందం అనిపించింది వెలవెలబోతున్న ఆలయం కళ కళ లాడుతుందన్న ఆశ వారిని పరవశుడిని చేసింది  మళ్లీ కారు ఎక్కారు గంట సేపట్లో బూద్పుర్ చేరుకున్నారు రెడ్డి గారు పునరుద్ధరించిన ఆలయాన్ని కలియ దిరిగి అక్కడ ఉన్న కల్యాణ చాళుక్య చక్రవర్తులలో 6వ విక్రమాదిత్యుని క్రీస్తు శకం 1121 నాటి శాసనాన్ని కాకతీయ గణపతి దేవుని క్రీస్తు శకం 1259 నాటి శాసనాన్ని కాకతీయ రుద్రమదేవి మల్యాల గుండని క్రీస్తు శకం 1272 నాటి శాసనాన్ని కాకతీయ రుద్రమదేవి క్రీశ 1277 నాటి (మల్యాల గుండని భార్య కుప్పాంబిక) శాసనాలను ఒకసారి తడిమి చూసి తొమ్మిది వందల సంవత్సరాల నాటి చరిత్రను నెమరు వేసుకున్నారు రెడ్డి గారు.
మళ్లీ బయలుదేరి కందూరు వెడదామనుకుంటుండగా 
బూద్పుర్ కు చెందిన పంచవటి ఆసుపత్రి అధినేత శ్రీకాంత్ రెడ్డి గారు కలిశారు చాలా రోజుల తర్వాత కలిశారు మీరు పోల్కంపల్లిలో కట్టిన ఆలయాన్ని చూద్దురుగాని రండి అన్నారు నేను గోపాల్ కలిసి కట్టిన ఆలయాన్ని చూడాలనిపించింది నేను ఆయన కారులో ఎక్కి నేరుగా పోల్కంపల్లి కొండమీద గజపృష్టా కారంలో శిల్పి గోపాల్ నేత్రత్వంలో నిర్మించిన సుందరతరాలయాన్ని చూసి అది నిజంగా మేము కట్టిన దేవాలయమేనా అని ఆశ్చర్యపోయారు రెడ్డి గారు ఇది పూర్తిగా కొత్త  ఆలయంలోపల శిల్పాలు అలంకరణ భక్తులని ఆకర్షిస్తున్నాయి.



కామెంట్‌లు