అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,- చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 ఆలయం నిర్మించడం ఒక ఎత్తు అయితే నిర్వహణకు నెలకు 50000 ఖర్చు పెట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో నిజమైన ఆనందం ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. వాళ్ల నాన్న నరసింహారెడ్డి గారు ఎమ్మెల్సీ నీతిమంతుడు సేవా తత్పరుడు దైవభక్తి కలవాడు ఆయన గుణగణాలను పుణికి పుచ్చుకున్న శ్రీకాంత్ రెడ్డి గారిలో కూడా ఆధ్యాత్మికత ధాతృత్వం అలానే వంటబెట్టాయి. ఆయన అక్కడే ఉంటానని చెప్పగా రెడ్డి గారు కృష్ణంరాజు గారు బయలుదేరారు తిరిగి వెళుతుండగా పోల్కంపల్లి చెరువు కట్టమీద విగ్రహాలు కల్పించాయి కారు ఆపి దిగి విగ్రహాల దగ్గరికి వెళ్లారు రెడ్డి గారు వారితో పాటు కృష్ణంరాజు గారు భూత్పూర్ దేవాలయ కమిటీ సభ్యులు అశోక్ గౌడ్ గారు ఉన్నారు  వరుసగా ఉన్న  ఒక విరిగిన విగ్రహం వీరభద్రుడు విరిగిన తల ఒక దేవత మరో రెండు తలలు తలలేని నిలబడి ఉన్న భైరవుడు ఒక శివ భక్తుడు సూర్య విగ్రహాలు చరిత్రను విడిచి పట్టుకుని వొద్దికగా నిలబడి ఉన్నాయి.ఒకటి రెండు రాష్ట్ర కూట ఒకటి కళ్యాణ చాణిక్య మరో రెండు కాకతీయుల కాలానికి చెందిన ఈ శిల్పాలు  పోల్కంపల్లి గ్రామ చరిత్రకు సాక్ష్యంగా ఉన్నాయి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ముందుకొచ్చి ఇరిగి పోయి ఒరిగిపోయిన ఈ దేవతామూర్తులని మానవతా దృక్పథంతో నైనా వాటిపైన కప్పు ఏర్పరిచి భద్రపరచకపోతారా అన్న ఆలోచనతో చెరువు కట్ట దిగి కారులో  ఎక్కరో లేదో ఎదురుగా మరో హృదయ విదారకు దృశ్యం వారి కంటపడింది గ్రామాభి వృద్ధిలో భాగంగా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టరు నాగుల కట్ట అనే చోట ఏకంగా నాలుగు దేవతలు ఒక నండి విగ్రహం పైన ఎక్స్వేటర్తో మట్టిని తెచ్చి పరచడం చేశాడు  చుట్టు ప్రక్కల వారు చూస్తూనే ఉన్నారు కానీ తరతరాలుగా పూజలు అందుకుంటున్న నాగదేవత అడుగు మట్టి పొరల్లో కనుమరుగవుతున్న ఆ విగ్రహాలను అలా పుట్టడమేమి పోలేదు. రెడ్డిగారు కృష్ణంరాజుగారు అశోక్ గౌడ్ గారు కిందకి దిగి ఆ విగ్రహాల దగ్గరకు వెళ్లి చేతులతో కొంచెం మట్టిని తొలగించారు. చుట్టుప్రక్కల వాళ్ళకు చెప్పి వాటిని కాపాడుకోవాలని చెప్పారు వాళ్లు అలాగానని మౌనంగా తలలూపారు ఆ విగ్రహాలు కూడా మౌనంగానే జరిగిందంతా చూస్తూ మానవ స్వార్థం ముందు తమ మహిమలు తలంచక తప్పదు అని దైవత్వాన్ని పోగొట్టుకొని దీనత్వాన్ని సంతరించుకున్నాయి కందూరు చోళుల కాలానికి చెందిన నంది పీకల రోజు దాకా మట్టిలో కూరుకుపోయి రంకెలేసే శక్తిని కోల్పోయింది చేతుల్లో కత్తి డాలు పట్టుకున్న 4 నాగదేవత శిల్పాలు ఒక చేతిలో పట్నం మరోచరిత్ర ఒక పండును పట్టుకున్న మరో దేవత ఆయుర్వేద మందులు నూరుకునే సానరాయి  కల్వం  నిర్లక్ష్యానికి గురవ్వడం పట్ల  వారంతా కూడా లిస్టుపై విజ్ఞప్తి చేయడం మినహా ఏమీ చేయలేక మళ్ళీ వారి ప్రయాణం కూడా సాగించారు.కామెంట్‌లు