అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి- చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 నిట్టూర్ప నిర్లిప్తతల మధ్య ముందుకు సాగిన రెడ్డి గారి బృందానికి చెరువు కట్ట పైన గల కోట గోడ శిథిలాలు చిన్నపాటి సముద్రాన్ని తలపించిన  కందూరు చెరువుకు చెలియలి కట్టగా తోచాయ్ కొంచెం ముందుకు సాగిన  బృందానికి లలితాసనంలో ఒక చేత దంతం మరో చేత మోదకం పై రెండు చేతుల్లో పాశం అంకుశాలను నాగ యజ్ఞోపవీతం జటా మా కుటాన్ని ధరించిన వినాయకుని విగ్రహం కనిపించింది ఒక బండరాతిని తొడచి మలచిన ఆ విగ్రహానికి నలుపు రంగు ఆభరణాలకు బంగారు పురము వెనుక గంధపు రంగుల నివేసి గ్రామస్తులు తమ భక్తి శ్రద్ధాన్ని చాటుతున్నారే తప్ప ఒక చారిత్రక శిల్పానికి అపచారం చేస్తున్నామన్న స్పృహ  లేదేమిటా అని అనిపించింది రెడ్డి గారికి  గ్రామస్తులకు ఆ విగ్రహం క్రీస్తు శకం 12వ శతాబ్దినాటిదని కందూరును రాజధానిగా పాలించిన కందూరు చోళుల కాలం నాటిదని ఇక ముందు రంగులు  లే వద్దని అవగాహన కల్పించారు రెడ్డి గారు సరైన అన్నారు వారు ఎవరో ఒక పుణ్యాత్ముడు ఎండకు ఎండుతూ నానుతూ తడుస్తున్న వినాయకుని విగ్రహం పైన రెండు రేకులు  కప్పాడు. అలా కొంచెం ముందు కెళ్లగా శిథిలాలయ పునాదుల దగ్గర ఆలీఢాసనంలో అంజలి ముద్ర తోనున్న గరుత్మంతుని విగ్రహం కొంచెం ముందు రోడ్డు ప్రక్కనే బళ్లాలతో పోరాడుతున్న ఇద్దరు శిల్పం రామలింగేశ్వర ఆలయం వైపు వెళ్లే దారిలో ఎడమవైపున ఉన్న రెండు పెద్ద బండలపైన చిన్నపాటి యుద్ధం పోరాడుతున్న నేలకు ఉరుకుతున్న వీరుడు ఒక ప్రక్కగా పోరాటంలో అసువులు బాసి వీర స్వర్గాన్ని పొందిన వీరుని శిల్పం మరో బండ్ల పైన దశ బుజీ మహిషాసుర మర్ధని శిల్పం కందూరు చోటుల శిల్పకలకు అద్దాం పడుతూ కట్టిపడేస్తున్నాయి రామేశ్వరాలయం ముందు మెట్లకు అటు ఇటు వీరుల శిల్పాలున్నాయి ఆలయంలోకి ప్రవేశించిన రెడ్డి గారికి ఆలయం ముందు ఒక శాసనం కనిపించండి  దానిపై సున్నం సింధూరం రంగులతో చదివితే స్థానిక పాలకుడైన మహా మండలేశ్వర చోళ కురువ బెట్ట కందర్పుడు రామేశ్వర దేవుని తీర్చిన దాన వివరాలు తెలిశాయి చెట్టు కింద గల మరో విగ్రహం రంగులు పులుముకొని రూపు కోల్పోయింది. ఆలయ ద్వారా శాఖలకు నందికి ద్వార పాలకులకు రంగులే రంగులు ఆలయ పరిసరాలను పరిశీలిస్తూ ఉండగా ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి గారి ఫోను అయ్యా మీరు అక్కడ ఏం చేస్తున్నారు అక్కడి కోనేరును ఒడ్డును నా కదంబరంట్లన్నీ చూడండి నేను కందూరుకు చాలా సార్లు వచ్చాను మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది అని అన్నారు  కోనేరును బాగు చేయిస్తున్నారు తవ్విన మట్టిని పరిశీలిస్తే శాతవాహనుల కాలపు ఎరుపు మెరిసే ఎరుపు ఊదా రంగు మట్టి పాత్రల  ముద్రలు కోకొల్లలుగా కనిపించాయి ఒక ప్రక్క ఆకలి వేస్తోంది ఆలయ చరిత్ర మాత్రమే కాళ్లను కట్టిపడేస్తోంది అర్షకుల సన్మానం తర్వాత అశోక్ గౌడ్ లో ఏర్పాటు చేసిన జోన రొట్టె పుంటి కూర అన్నం పెరుగు ఆవకాయ నలుగు తింటూ ఉంటే రుచికి అర్థం ఏమిటో తెలిసింది ఆతిథ్యం విలువ అర్థమయింది.


కామెంట్‌లు