అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా. నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు -6302811961.
 రెడ్డి గారి ప్రయాణం అలాగే కొనసాగుతోంది కొండలు, గుట్టలు కొత్తగా తవ్విన లోతైన కాలువలు  అక్కడక్కడ నీటిమడుగులు  అంతలో రానే వచ్చింది కనిపించేదే కొండపోచమ్మ అని నసీరుద్దీన్ గారు చెప్పారు ఆలయంలోని ఒక జైన విగ్రహమే  కొండపోచమ్మగా పూజల అందుకొంటుందని చెప్పారు కొంతమంది పరిశోధక యువకులు పోచమ్మ గుడి వైపు ఎదురుగా  అటు ఇటు ఒక కిలోమీటరు పొడవునా  కొలువు చేరిన అంగళ్లు కాఫీ హోటల్లు కూల్డ్రింక్ షాపులు వాటిల్లో బీరు (బ్రాందీ) బాటిల్ అమ్మవారిని దర్శించుకున్న స్త్రీలు పొంగళ్ళు వంటలు చేస్తుంటే మగమహారాజులు చెట్ల కింద విందారగిస్తూ మద్యం సేవిస్తూ ఉల్లాసంగా కాలం గడుపుతున్నారు ఇంతలో సిద్దిపేట నుంచి మిత్రులు అహోబిలం కరుణాకర్ సామలేటి మహేష్ కిరణ్ గారు మోటార్ బైకుల పై రానే వచ్చారు. అందరూకొండ పోచమ్మ ఎదురుగా చాయ్ తాగి గుడికి ఎదురుగా ఒక గుట్టకు చేరారు. దట్టంగా పొదలు ఏపుగా ఉన్న చెట్లు వారికి మెట్లే కనిపించలేదు కష్టపడి పైకి చేరుకున్న మాకు ధర్మాసనంలో ధ్యానముద్రలో ఉన్న మహావీరుని మొండి విగ్రహం కనిపించింది  తల కోసం చుట్టూ వెతికారు రెడ్డి గారు అయినా లాభం లేకపోయింది కానీ మధ్య యుగాల జైన బసదుల ఆడవాళ్లు వాటిని కట్టడానికి వాడిన ఇనుపరాళ్ళు అక్కడ కూడా ఆలయ విడిభాగాలు ఒక బావి మండప శిథిలాలు కనిపించి వాటిబ్బృందానికి కనువిందు చేసినట్లు ఆ శిథిలాల్లో సౌందర్యం కనిపించింది తదేకంగా చూస్తున్న వీరికి సామలేటి మహేష్ కేక వినిపించింది ముళ్లకంచిలో చింత చెట్టు కింద మరో జైన విగ్రహ శకలం ఉందన్నారు అందరూ అటువైపు వెళ్ళాము పడిపోయిన ఒక స్తంభం దానిమీద ఒక జైన విగ్రహం ఎలాగో ముళ్ళకంచె దాటి దగ్గరకు వెళ్లారు.ఆ శిలాస్తంభం పైన నాలుగు వైపులా నలుగురుజైన తీర్థంకరులు వారిలో అందరూ నగ్నంగా పద్మాసనం పై కూర్చుని ధ్యానమగ్నులై నిమిరిత నేత్రాలతో ఉన్నారు ఒకప్పుడు కళ కళ లాడిన జైన భసతి లోని విగ్రహాలు భిన్నమై బిక్కు బిక్కుమంటూ వెలవెల బోతున్నాయి అందరూ బాధపడ్డారు క్రీస్తు శకం తొమ్మిది- పది శతాబ్దాలలో రాష్ట్ర కూటులు వేములవాడ  చాళుక్యుల కాలం నాటి చారిత్రక స్థలాన్ని జైన బసతి కట్టడాలని శిల్పాలని పరీక్షించాలని స్థానికులకు సర్పంచికి విజ్ఞప్తి కంటే  ఏమీ చేయలేకపోయారు అయినా ఆ విగ్రహాలను గుర్తించాలన్నా అహోబిలం కరుణాకర్ సామలేటి మహేష్ నసీ రుద్దీన్ కిరణ్ ఇంకా వారితో పాటు వచ్చిన స్థానిక యువకుల కళ్ళల్లో ఆశలు వెలుగుని చూశారు రెడ్డి గారు మళ్ళీ బైకులపై కొండపోచమ్మ దగ్గరకు వచ్చారు  అందరూ కలిసి కొమరవెల్లి వెళ్దామని బయలుదేరారు.


కామెంట్‌లు