అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 రెడ్డిగారు కరీంనగర్ వెళ్లేటప్పుడల్లా కొమరవెల్లికి వెళ్లే  బోర్డు కనిపించేది చూడాలన్న తపనే కానీ కుదరలేదు వెళుతూ ఉంటే ఒక స్థితిలో ఆలయం వారి ప్రయాణానికి అడ్డుకట్ట వేసింది  కారు దిగి ఆలయ ప్రాంగణంలో శిథిల మండపాలు కొద్దిగా వంగినా ఠీవి తప్పని ధ్వజస్తంభం  కూరుకుపోయిన శిల్పాలు మండపంపై ఒకవైపు సింధూరంతో నిండిన భక్తాంజనేయ శిల్పం ద్వారబంధాలపై జయ విజయ శిల్పాలు ఆలయంలో క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక మండపం క్రీ.శ 18 వ శతాబ్దంలో జీర్ణోద్ధరణలో ప్రాచీనతను  కోల్పోయింది. అది కొమరవెల్లి మండలం అయినాపూర్ గ్రామం చుట్టుప్రక్కల వాళ్ళని పిలిచి వారికి ఆలయ చరిత్ర చెప్పి  కాపాడుకోవాలని బ్రతిమలాడి మళ్లీ బయలుదేరారు రెడ్డి గారు  కామారెడ్డి (కొమరవెల్లి) కొమరన్నపేరిట శివుడు కొలువుదీరిన ఆలయం.
ఆస్తవ్యస్త నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడి క్యూ లైన్ లు ఇష్టం వచ్చిన రంగులు అన్నీ కలిపి వారసత్వాన్ని వరుస తప్పించాయి తెలంగాణ ప్రజల మనసుల్లో మల్లన్న పెనవేసుకొని ఇప్పటికీ ప్రజాదరణ గల దేవాలయంగా గుర్తింపు పొందింది లేని దల్ల చారిత్రక స్పృహ వారసత్వ పరి రక్షణ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఆట వస్తువులతో నిండిన ఆంగళ్లు మన హస్తకళలు మాత్రం లేవు ఆలయం చూద్దామని అందరినీ అక్కడ చారిత్రిక ఆనవాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్లారు. అహోబిలం కరుణాకర్  గారు ఒక కొండ చరియపై చెక్కిన నిలువెత్తు  పార్శ్వనాథుని విగ్రహం ఆకట్టుకుంది. కాయోత్సర్గాసనంలో నగ్నంగా నిలబడిన పార్ట్స్యనాథుని తల పైన నాగరాజు ఆ విగ్రహం క్రీస్తు శకం తొమ్మిది పది శతాబ్దాల నాటి దని చెప్తున్నాయి  ఆ తర్వాత వేములవాడ చాళుక్యుల కాలపు  రాతిరథం చక్రాలు వాటిపైన ఆధునికరించినా సిమెంట్ రథం ప్రాచీనత ప్రక్కదారి పట్టినా వైనాన్ని తెలియజేస్తున్నాయి.
కొమరెల్లి మల్లన్న ఆలయ గోపురం మాత్రం బంగారు చాయలు కొండగుట్టల మధ్య వెలిగిపోతుంది దేవాలయం అధికారులకు బెత్తం పుచ్చుకొని ఆలయ నిర్వహణ ఎలా ఉండాలో ప్రాచీన విగ్రహాలు, కట్టడాలను ఎలా కాపాడుకోవాలో వారికి పాఠం చెప్పాలని అనిపించింది రెడ్డి గారికి వారి పిచ్చి గాని ఎవరు వింటారు. వారు చెప్పినా  ఆకలి మామూలే పక్కన ఉన్న ఒక హోటల్లో స్థానిక నాస్థా ఏమైనా దొరుకుతుందేమోనని వెతికారు. ఎక్కడ చూసినా ఇడ్లీ దోశ పూరిలే కనీసం ఉగ్గాని దొరుకుతుందేమోనని అడిగాడు రెడ్డి గాడు లేదన్నారు సరేనని వారే బొరుగులు తెప్పించి ఉగ్గాని చేయించుకుని ఉల్లిముక్కలు నిమ్మరసం కలిపి తింటూ ఉంటే ఆ రుచి వేరు కొమరవెల్లి నుంచి బయలుదేరి 2 కిలోమీటర్లు దాటేటప్పటికీ పొలాల్లో పొడిగాటి రంగులతో  ఉన్న నెంబర్లు కనిపించాయి  కనిపించడమే కాదు కవ్వించాయి కూడా.కామెంట్‌లు